యూవీ క్రియేషన్స్ లో ప్రభాస్ మరో సినిమా!

Sat Aug 13 2022 21:00:01 GMT+0530 (IST)

Prabhas Giving A Green Signal To Another Movie With UV Creations

రెబల్ స్టార్ ప్రభాస్ ఓవైపు సలార్ ఆదిపురుష్ ప్రాజెక్ట్ కే సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. మరోవైపు ఇంకో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసే ఆయన అభిమానులు.. కొత్త సినిమా అప్ డేట్స్ వచ్చాక మాత్రం డీలా పడిపోయారు. ఎందుకంటే ప్రభాస్ తన సినిమా చేస్తోంది యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో. అయితే ప్రాబ్లం ఎంటని అనుకుంటున్నారా..

ప్రభాస్ స్నేహితులు వంశీకృష్ణారెడ్డి అలాగే సోదరుడు ప్రమోద్ ఉప్పలపాటి మరో స్నేహితుడితో కలిసి ప్రారంభించిన యూవీ క్రియేషన్స్. తెలుగులో రన్ రాజా రన్ మిర్చి రాధేశ్యామ్ లాంటి అనేక సినిమాలను నిర్మించిన ఈ సంస్థ ప్రభాస్ చేస్తున్న దాదాపు అన్ని సినిమాల్లోనూ భాగస్వామ్యం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో సహ నిర్మాణం చేస్తూ ఉంటుంది.

ప్రభాస్ ఇప్పటికే ఈ బ్యానర్ లో మూడు సినిమాలు చేశారు. ఆ మూడింటిలో మిర్చి సినిమా ఒకటి సూపర్ హిట్ కాగా  రాధేశ్యామ్ సాహో సినిమాలు డిజాస్టర్ ఫలితాలను ఇచ్చాయి. అంతేకాక ప్రభాస్ గనుక యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేస్తే సినిమా అనుకున్న టైంకి విడుదల కాదని ఆయన ఫ్యాన్స్ భావిస్తూ ఉంటారు.

సొంత బ్యానర్ కావడంతో ప్రభాస్ అలక్ష్యం  వహిస్తాడో లేక నిర్మాతలే లైట్ తీసుకుంటారో తెలియదు కానీ అప్డేట్స్ విడుదల చేయడం మొదలు అన్ని విషయాల్లోనూ చాలా జాప్యం చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అందుకే ఆయన యూవీ క్రియేషన్స్ లో సినిమాలు చేయకపోతేనే బెటర్ అని ఫీల్ అవుతున్నారు. ఇలాంటి ఫీలింగ్ లో ఉన్న ఫ్యాన్స్ కి ప్రభాస్ తాను మళ్లీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేయనున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు.

ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు వహిస్తారు అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. గతంలో మారుతి సినిమా యూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే తెరకెక్కే  అవకాశం ఉందని ప్రచారం జరిగింది. బహుశా ఆ సినిమానే ఈ బ్యానర్లో చేస్తారా లేక అది కాకుండా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అనే విషయం తెలియాల్సి ఉంది.