Begin typing your search above and press return to search.

ప్రభాస్20: నెక్స్ట్ షెడ్యూల్ ప్లానింగ్ ఇలా..

By:  Tupaki Desk   |   23 Jan 2020 5:34 AM GMT
ప్రభాస్20: నెక్స్ట్ షెడ్యూల్ ప్లానింగ్ ఇలా..
X
'సాహో' తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా లో నటిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగు కు దాదాపు ఆరు నెలల గ్యాప్ వచ్చింది. రెండు రోజుల క్రితం కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్ పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించడం కోసం మూడు కోట్ల రూపాయల ఖర్చుతో ఒక భారీ సెట్ నిర్మించారు. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు హీరోయిన్ పూజ హెగ్డే కూడా పాల్గొంటోంది.

ఇదిలా ఉంటే ఈ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత తదుపరి షెడ్యూల్ ను యూరోప్ లో ప్లాన్ చేశారట. #ప్రభాస్ 20 టీమ్ ఫిబ్రవరిలో ఆస్ట్రియాకు వెళ్తారని అక్కడ అందమైన ప్రదేశాలలో రెండు పాటలను చిత్రీకరిస్తాని సమాచారం. పాటలతో పాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరుపుతారట. 'సాహో' తర్వాత ఈ సినిమా షూటింగ్ విషయంలో మార్పు చేర్పులు జరిగాయని.. బడ్జెట్ తగ్గించడం కోసం యూరోప్ షెడ్యూల్స్ రద్దు చేశారని గతంలో టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు అవంతా రూమర్లేనని యూరోప్ షెడ్యూల్స్ గతంలో ప్లాన్ చేసినట్టే జరుగుతాయని క్లారిటీ వచినట్టే.

1960-70 లలో విదేశాలలో జరిగిన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ను విభిన్నంగా ప్రెజెంట్ చేయబోతున్నారట. ప్రభాస్ లవ్ స్టోరీస్ లో నటించి చాలా కాలం అయింది. దీంతో ప్రేక్షకులకు కూడా ఓ భిన్న అనుభూతి కలగడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్.. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.