Begin typing your search above and press return to search.

ఒకే జానర్ లో ప్రభాస్ 2 సినిమాలు..?

By:  Tupaki Desk   |   11 Jun 2021 2:30 AM GMT
ఒకే జానర్ లో ప్రభాస్ 2 సినిమాలు..?
X
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల నుండి ఒక్కో సినిమా రావడానికే ఏళ్ల సమయం పడుతుంది. అలాంటిది ఒకే జానర్ సినిమాలు వస్తున్నాయంటే ఎలా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియంది కాదు. మాములుగా పాన్ ఇండియా ఫేమ్ కలిగిన హీరోలకు ఓ జానర్ ఫేవరేట్ అయినప్పటికీ అదే జానర్ లో సినిమాలు చేసేందుకు ఇష్టపడరు. ఎందుకంటే రిపీట్ సినిమాలు చేసి అభిమానులను నిరుత్సాహపరచడం కూడా వారికీ నచ్చదు. కానీ కొందరు హీరోలు తాము అనుకున్నట్లుగానే చేసేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఓ చేసిన జానర్ సినిమాలు హిట్ అయితే గనక అదే నమ్మకంతో మరో సినిమా లైన్ చేసే అవకాశం ఉంది. ఇంతకీ ఆ జానర్ ఏంటంటే.. మైథిలోజికల్ జానర్.

ఈ జానర్ లో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే అప్పుడే సెకండ్ మూవీ లైన్ లో పెడుతున్నట్లు టాక్. ఆ పాన్ ఇండియా హీరో ఎవరో కాదు డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రాధేశ్యామ్ - లవ్ స్టోరీ.. సలార్ - మాస్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యం.. ఆదిపురుష్ - పౌరాణికం.. నాగ్ అశ్విన్ తో సైంటిఫిక్ ఫిక్షన్ ఫిల్మ్.. ఆ తర్వాత లైన్ లో ఉంది మళ్లీ పౌరాణికం అని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా కంప్లీట్ చేసి సలార్ - ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు కూడా ఏకకాలంలో రూపొందుతున్నాయి. అయితే సలార్ యాక్షన్ మూవీ కాగా ఆదిపురుష్ మైథలాజికల్ సినిమా అనేది తెలిసిందే. అయితే త్వరలోనే మరో మైథలాజికల్ సినిమా లైనప్ చేయనున్నాడా ప్రభాస్.. అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు.

ఎందుకంటే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి మూవీస్ తర్వాత ప్రభాస్ దిల్ రాజు నిర్మాణంలో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. ఆ సినిమాను కూడా పాన్ ఇండియా ఫేమ్ కలిగిన ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్ లో ఆల్రెడీ సలార్ రూపొందుతుంది. తదుపరి సినిమా కూడా చర్చల దశలో ఉంది. ఆల్రెడీ దిల్ రాజుతో ప్రశాంత్ నీల్ కొన్ని నెలలుగా చర్చలు జరుపుతున్నాడు. మరి ప్రభాస్ తో ఈసారి ఈ మాస్ యాక్షన్ డైరెక్టర్ పౌరాణిక చిత్రం చేయనున్నట్లు సమాచారం. ఎందుకంటే దిల్ రాజు ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో ఓ పౌరాణిక కథను కూడా ఎంపిక చేసాడని ఇండస్ట్రీ టాక్. మరి ఈ లెక్కన ప్రభాస్ కు బాగా ఇష్టమైన జానర్ కాబట్టి వెంటనే చేసినా పర్వాలేదని భావిస్తున్నాడట. ఆల్రెడీ ఆదిపురుష్ లో రాముడుగా కనిపించనున్నాడు ప్రభాస్. మరి ఈసారి ఏ అవతారంలో అలరిస్తాడో తెలియాల్సి ఉంది. మొత్తానికి ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్.