పవన్ కోసం రెడీ అవుతున్న పవర్ ఫుల్ స్టోరీ!

Wed Feb 24 2021 09:00:01 GMT+0530 (IST)

Powerful story getting ready for Pawan

పవన్ కల్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ వెళుతున్నాడు. దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. పెద్ద పెద్ద బ్యానర్లన్నీ ఆయనతో సినిమా చేయడానికి పోటీ పడుతున్నాయి. ఇక చాలామంది రచయితలు ఆయనను దృష్టిలో పెట్టుకుని కథలను సిద్ధం చేస్తున్నారు. ఆ జాబితాలో 'బాహుబలి' కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా కనిపిస్తున్నారు. ఆయన ఇప్పుడు పవన్ కథపైనే కసరత్తు చేస్తున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగానే వినిపిస్తోంది.విజయేంద్ర ప్రసాద్ కి రచయితగా ఎంతో అనుభవం ఉంది. ఎన్నో విజయవంతమైన సినిమాలకి ఆయన పనిచేశారు. ఆయన కథలు ఎంత ఆసక్తికరంగా .. అనూహ్యంగా .. వినోదభరితంగా ఉంటాయనడానికి 'బాహుబలి' ఊరంతటి ఉదాహరణ. ఇక ఆయన అందించిన కథలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి విజయేంద్రప్రసాద్ ఇటీవల పవన్ ను కలిసి ఒక లైన్ చెప్పారట. ఆ లైన్ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేయమని పవన్ అన్నాడట. దాంతో ఆయన ఆ స్క్రిప్ట్ పైనే కూర్చున్నట్టు చెబుతున్నారు.

సాధ్యమైనంత త్వరగా విజయేంద్రప్రసాద్ పూర్తి స్క్రిప్ట్ ను పవన్ కి వినిపించే ఉద్దేశంతో ఉన్నాడని అంటున్నారు. కథ ఓకే అయితే దర్శకత్వ బాధ్యతలను పవన్ ఎవరికి అప్పగిస్తాడనేది చూడాలి. ఈ ఏడాది పవన్ నుంచి మూడు విభిన్నమైన సినిమాలు రానున్నాయి. ఆ తరువాత ఆయన హరీశ్ శంకర్ .. సురేందర్ రెడ్డితో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

వాళ్లిద్దరూ కూడా తమ వైపు నుంచి అందుకు సంబంధించిన అన్ని పనులను పూర్తిచేసుకుని ఉన్నారని అంటున్నారు. మరి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్న పవర్ఫుల్ స్టోరీ నేపథ్యం ఏమిటో .. పవన్ పాత్ర ఎలా ఉండబోతుందో అనేది అభిమానులలో ఆసక్తిని పెంచే అంశమే!