పవర్ ఫుల్ గంగుబాయి నయా పోస్టర్!

Sat Feb 27 2021 21:37:02 GMT+0530 (IST)

Powerful Gangubai New Poster!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'గంగుబాయి కతీయవాడి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండి సినిమా పై ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. ఇటీవలే గంగుబాయి టీజర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. చూస్తుంటే ఈ సినిమా అలియా కెరీర్లోనే చాలా స్పెషల్ మూవీగా నిలవనుందని అనిపిస్తుంది. ముంబైలోని కంటీపుర ఏరియాకు చెందిన ఫేమస్ బ్రోతల్ హౌస్ ఓనర్ గంగుబాయి లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు సంజయ్ భన్సాలీ. ఇందులో అలియా గంగుబాయిగా యవ్వనం నుండి ముసలితనం వరకు ఎలా కనిపిస్తుందో అన్ని వెరియేషన్స్ చూపించనున్నట్లు మేకర్స్ తెలిపారు.మొత్తానికి గంగూబాయి కతియావాడి జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఎస్ హుస్సేన్ జైదీ రచించిన పుస్తకం ప్రకారం గంగూబాయి కతియావాడీ తన భర్తతో కలిసి గుజరాత్ నుండి ముంబైకి వస్తుంది. అయితే ఆమెను  ద్రోహం చేసి వ్యభిచారం మార్కెట్లో ఇరికిస్తే.. అప్పుడు చాలామంది అండర్వరల్డ్ నేరస్థులతో సంబంధాలు ఏర్పరచుకుని సౌత్ ముంబైపై పట్టు సాధిస్తుందట. ఆ తర్వాత ఒక పెద్ద వేశ్యాగృహం యజమానిగా మారుతుంది.

అలాగే ముంబై కంటిపురాలోని రెడ్ లైట్ ప్రాంతంలో మహిళలు అనాధల పరిస్థితిని మెరుగుపరిచేందుకు గంగుబాయి కృషిచేసిందని టాక్. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. ఒక్కో డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుండి అలియా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో అలియా వైట్ అండ్ వైట్ ధరించి చేతికి హ్యాండ్ బ్యాగ్.. చేతిలో సిగరెట్ పట్టుకొని స్టైల్ గా కారుకు నిలబడి ఉంది. మొత్తానికి అలియా పాత్రలో జీవిస్తున్నట్లే అనిపిస్తుంది. చూడాలి మరి ప్రభాస్ రాధేశ్యామ్ తో పాటు గంగుబాయి జులై 30న పోటీపడుతోంది. అలాగే ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుందని టాక్.