Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ అప్ కమింగ్ సినిమాలు - రెమ్యూనరేషన్స్..!

By:  Tupaki Desk   |   23 April 2021 1:30 AM GMT
పవర్ స్టార్ అప్ కమింగ్ సినిమాలు - రెమ్యూనరేషన్స్..!
X
'వకీల్ సాబ్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. 'వకీల్ సాబ్' సెట్స్ పై ఉండగానే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' అనే పీరియాడిక్‌ డ్రామాను స్టార్ట్ చేశాడు. ఇదే క్రమంలో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ సినిమాని ప్రారంభించి ఇప్పటికే 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేశాడు పవన్. ఈ సినిమాలతోపాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలానే నిర్మాత బండ్ల గణేష్ ప్రొడక్షన్ లో ఓ ప్రాజెక్ట్ ఉంటుందని వెల్లడించారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా ప్రముఖ నిర్మాత జె.పుల్లారావు నిర్మాణంలో పవన్ ఒక సినిమాకు అడ్వాన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇలా బ్యాక్ టూ బ్యాక్ అర డజను సినిమాలను లైన్ లో పెట్టి అభిమానులను ఖుషీ చేస్తున్న పవన్ కళ్యాణ్.. వీటి కోసం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 'వకీల్ సాబ్' లో 55 నిమిషాల కోసం సుమారు 55 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న పవన్.. 'వీరమల్లు' చిత్రానికి 15 కోట్లు అడ్వాన్స్ గా తీసుకున్నాడట. ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కోవిడ్ కారణంగా లేట్ అవుతూ వచ్చింది. అయితే ఈ మధ్య స్పీడ్ అప్ చేసిన పవన్, దీని కోసం ఇప్పుడు రోజుకి కోటిన్నర వరకు తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది.

అలానే బిజీ షెడ్యూల్ లో కూడా డేట్స్ కేటాయించిన 'అయ్యప్పనుమ్..' రీమేక్ లో నటించేందుకు పవన్ దాదాపు 22 కోట్ల వరకు అడ్వాన్స్ తీసుకున్నారట. అంతేకాక ఈ మూవీ నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ కూడా పవర్ స్టార్ కే ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని టాక్. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే సినిమాకు 30 కోట్లు పారితోషికంతో పాటుగా లాభాల్లో 50 శాతం వాటా పవన్ కే దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రామ్ తాళ్ళూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డితో చేయబోయే సినిమా కోసం 40 కోట్లు రెమ్యూనరేషన్ ప్లస్ లాభాల్లో వాటా కూడా తీసుకోనున్నారట.

పవన్ కోసం ఇప్పటికే కథ సిద్ధంగా ఉందని.. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు పూర్తైన వెంటనే సినిమా చేస్తామని నిర్మాత జె. పుల్లారావు ఇటీవలే వెల్లడించారు. దీని కోసం ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అలానే సరైన డైరెక్టర్ ని వెతికి పట్టుకునే పనిలో ఉన్న బండ్ల గణేష్ కూడా పవన్ కు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసేలా ప్లాన్స్ చేసుకున్న పవన్ కళ్యాణ్.. దానికి తగ్గట్టుగా డేట్స్ అడ్జస్ట్ చేస్తూ, అదే విధంగా భారీగా పారితోషకం తీసుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.