పవర్ స్టార్ రీమేక్ మూవీ.. సంక్రాంతికి వాయిదా పడిందా??

Thu Jun 10 2021 16:00:01 GMT+0530 (IST)

Power Star Remake Movie Postponed To Sankranthi

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇదివరకటిలా సినిమాలు స్లోగా చేయడం లేదు. వరుస సినిమాలతో ఒక్కో సినిమాను విడుదలకు రెడీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నాడు. ఓవైపు ఆల్రెడీ ఈ ఏడాది వకీల్ సాబ్ విడుదల చేసి గ్రాండ్ రీఎంట్రీ అందుకున్నాడు. A సినిమా సక్సెస్ తో ప్రస్తుతం తదుపరి సినిమాలు త్వరగా ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.  మరోవైపు అయ్యప్పనుమ్ కోషియం హరిహర వీరమల్లు సినిమాలను వేగంగా పూర్తి చేయనున్నాడు. అయితే ఇప్పటివరకు ఆల్రెడీ అయ్యప్పనుమ్ షూటింగ్ నలభై శాతం పూర్తి చేశారట పవన్ కళ్యాణ్ - రానా. ఈ ఏడాది వకీల్ సాబ్ తో పాటు మరో సినిమా రిలీజ్ చేయాలనీ అనుకున్నాడట పవన్.వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. అలాగే వసూళ్లు కూడా భారీగానే రాబట్టింది. ఈ సందర్బంగా మలయాళం రీమేక్ అయ్యప్పనుమ్ కోషియం సినిమాను ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇదివరకు హింట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు. అంటే అదికూడా షూటింగ్ కంటిన్యూగా జరిగి ఉంటే సాధ్యం అయ్యేదేమో.. కానీ వకీల్ సాబ్ రిలీజ్ టైంలోనే కరోనా సెకండ్ వేవ్ రావడం.. షూటింగ్స్ - సినిమాలు అంతా పరిస్థితి తారుమారు కావడంతో మేకర్స్ మళ్లీ ఆలోచనలో పడ్డారు. ఎలాగో ఈ కరోనా కారణంగా షూటింగ్స్ సాధ్యపడలేదు కాబట్టి సినిమా రిలీజ్ డేట్స్ వాయిదా వేస్తున్నారు.

తాజా సమాచారం మేరకు.. అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ ఇంకా సగానికి పైగా షూటింగ్ మిగిలి ఉందని.. సినిమాను ఆగష్టు - సెప్టెంబర్ లో కాకుండా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఎందుకంటే లాక్ డౌన్ తర్వాత ఇప్పటికి సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఈ సినిమాలో పవన్ తో పాటు రానా అదే స్థాయి రోల్ ప్లే చేస్తున్నాడు. మరి వీరి పోరు ఎలా ఉంటుందో తెలీదు కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా ఆసక్తి రేపుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే అయ్యప్పనుమ్ రిలీజ్ డేట్ సంక్రాంతికి వాయిదా వేస్తే.. అసలు సంక్రాంతికి సెట్ చేసినటువంటి 'హరిహర వీరమల్లు' సినిమా పరిస్థితి ఏంటని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి మేకర్స్ ఈ సినిమా పీరియడిక్ జానర్ కాబట్టి మేకింగ్ చాలా సమయం పడుతుందని వీరమల్లు సినిమాను సమ్మర్ కు ప్లాన్ చేసే అవకాశం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. చూడాలి మరి అధికారికంగా మేకర్స్ స్పందించి ఏం చెబుతారో..!