షాకింగ్ లుక్: ఆమెలా చెలరేగిన అల్లరోడు!

Mon Jan 20 2020 12:39:16 GMT+0530 (IST)

Poster: Comedy hero goes bold for his next!

ప్రయోగాలు చేయనిదే ఆర్టిస్టుకు మనుగడ లేదు. కొత్తగా కనిపించకపోతే ఎవరూ పట్టించుకోరు. పాత మూస విధానాలకు స్వస్థి చెప్పకపోతే ఆశించిన రిజల్ట్ రావడం లేదు. ఏం చేసినా డిఫరెంటుగా ప్రయత్నిస్తూనే.. కమర్షియల్ గా మెప్పించాలి. ప్రస్తుత ఆడియెన్ మైండ్ సెట్ ని రీడ్ చేసి దాని ప్రకారం నడుచుకోవాలి. లేదంటే పెట్టిన సొమ్ములన్నీ గంగలో పోసినట్టే. ఇక నటీనటులకు ఇది వర్తిస్తుంది. ఎవరైనా కొత్తగా ప్రయోగాత్మకంగా కనిపిస్తేనే ఆదరణ దక్కుతోంది. ఈ విషయాన్ని ప్రతిసారీ గమనించినట్టే కనిపిస్తున్నా అల్లరోడి ప్రయోగాలేవీ సక్సెస్ కాలేదు ఎందుకనో. అల్లరి లాంటి ప్రయోగాత్మక చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమై దశాబ్ధం పైగా కెరీర్ ని సాగించిన నరేష్ రొటీన్ కామెడీ చిత్రాలు చేసినా అప్పుడప్పుడు ప్రయోగాలతో మెప్పించాలని ట్రై చేశాడు. కానీ ప్రతిసారీ దుర దృష్టమే అతడిని వెంటాడింది.అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా అతడు ప్రయోగాల బాటను వదల్లేదు. వీలు చూసుకుని ప్రయోగాలకు సిద్ధమవుతున్నాడు. ఇదిగో `నంది` అలాంటి ప్రయత్నమే. తాజాగా రిలీజైన `నంది` పోస్టర్ అందుకు సింబాలిక్. ఈ పోస్టర్ లో నరేష్ లుక్ అభిమానులకు షాకిస్తోంది. ఒంటిపై బట్టలన్నీ ఒలిచి నూలుపోగైనా లేకుండా గొలుసులతో తలకిందులుగా వేలాడదీసి తాళ్లతో కట్టేసి కొరడాతో వాతలు పెట్టి... ఆ రూపం చూస్తుంటేనే గగుర్పొడుస్తోంది. ఇలాంటి కష్టం పగవాడికైనా రాకూడదు దేవుడా! అన్నంతగా ఉంది మరి. అల్లంత దూరం నుంచి సిమెంట్ విండో నుంచి సూర్యను తొలి పొద్దు కిరణం ఆ నగ్న దేహాన్ని తాకుతూ వెలుతురు పంచుతోంది. నంది పోస్టర్ లో క్రియేటివిటీ ఆకట్టుకుంది. అంతకుమించి క్యూరియాసిటీ పెంచడంలో సక్సెసయ్యారు. ఆమె చిత్రంలో అమలాపాల్ నగ్నంగా నటించి అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరహాలోనే అల్లరోడి ప్రయోగం ఆసక్తిని పెంచుతోంది.

తాజా లుక్ చూడగానే తన పాత్ర కోసం నరేష్ ఎంతగా డెడికేట్ అవుతాడో అర్థం అవుతోంది. ఆ నగ్న రూపం.. తీవ్ర గాయాలతో దిగ్భ్రాంతి నే కలగ జేస్తోంది. అయితే తనను ఎందుకిలా నగ్నంగా చిత్రహింసలకు గురి చేశారు? దీనికి కారకులెవరు? అన్న సందేహాలు కలుగుతున్నాయి. అల్లరి నరేష్ నిరంతరం విభిన్నమైన జానర్ చిత్రాలతో ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారనే బలమైన సంకేతం వెళ్లింది ఈ పోస్టర్ తో. విజయ్ కనకమెదల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సతీష్ వేగేష్న నిర్మాత. ఈ సోమవారం హైదరాబాద్ లో సినిమాని ప్రారంభించారు. శ్రీచరన్ పాకాల బాణీలు అందిస్తున్నారు.