డ్యాన్స్ మాస్టర్ తో పాపులర్ యాంకర్ రొమాన్స్ ..!

Fri Dec 04 2020 10:09:47 GMT+0530 (IST)

Popular anchor romance with Dance Master

జబర్దస్త్ షోకు పోటీగా మెగా బ్రదర్ నాగబాబు ప్రారంభించిన కామెడీ షో `అదిరింది`. మొదట్లో అంతగా సక్సెస్ కాకపోయినా ఆ తరువాత పేరు మార్చి `బొమ్మ అదిరింది` అంటూ మళ్లీ రీలోడ్ చేసి వదిలారు. ప్రస్తుతం ఈ షో బాగానే పేలుతోంది. ముందు డబుల్ మీనింగ్ డైలాగ్ లపై విమర్శలు వెల్లువెత్తినా ఆ తరువాత నుంచి కామెడీ పరంగా క్వాలిటీ స్కిట్ లతో ఆకట్టుకోవడం మొదలుపెట్టారు.తాజాగా రిలీజ్ చేసిన షో ప్రోమో వైరల్ గా మారింది. ఈ  ప్రోమోలో క్రేజీ యాంకర్ శ్రీముఖి .. జానీ మాస్టర్  రొమాన్స్ వీరలెవెల్లో ఆకట్టుకుంటోంది. స్టేజ్ పై రొమాంటిక్ కపుల్ గా డ్యాన్స్ ఇరగదీశారు. ఈ షోలో వీరిద్దరి మధ్య  నడిచే రొమాంటిక్ ట్రాక్ ప్రోమోలో స్పష్టంగా కనిపిస్తోంది. `మన్మథుడు` చిత్రంలోని `గుండెల్లో ఏముందో పెదువుల్లో తెలుస్తోంది` అనే రొమాంటిక్ సాంగ్‌కి శ్రీముఖి... జానీ మాస్టర్ కూల్ గా డ్యాన్స్ చేసి స్టేజ్ ని హీటెక్కించారు. రొమాంటిక్ కపుల్ గా అదరగొట్టేశారు.

ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఛాన్స్ దొరికితే శ్రీముఖి చేసే రచ్చ మామూలుగా వుండదు అనేది అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రోమోలో అదే జరిగింది. రొమాంటిక్ సాంగ్ పడటంతో దాన్ని ఎంత వరకు వాడుకోవాలో అంత వరకు వాడుకుని శ్రీముఖి తన టాలెంట్ చూపించింది. ఈ ప్రోమో చూసిన వారంతా శ్రీముఖి అదరగొట్టేసింది అంటూ కితాబిచ్చేస్తున్నారు.