Begin typing your search above and press return to search.

పాస్ పోర్ట్ అడిగితే పాప్ స్టార్ త‌ల‌బిరుసు

By:  Tupaki Desk   |   17 Nov 2019 10:38 AM GMT
పాస్ పోర్ట్ అడిగితే పాప్ స్టార్ త‌ల‌బిరుసు
X
గ‌త వారం రోజులుగా ముంబైలో ప‌ర్య‌టిస్తున్న అమెరిక‌న్ పాప్ స్టార్ కేటీ పెర్రీ తిరిగి త‌న సొంత గూటికి ప్ర‌యాణం అయ్యింది నేడు. ఇప్ప‌టికే ముంబైలో మ్యూజిక్ కాన్సెర్టును పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ తిరిగి వెళుతూ విమానాశ్ర‌యంలో ఏం చేసిందో చూస్తే షాక్ తింటారు ఎవ‌రైనా. నెటిజ‌నుల్లో జోరుగా వైర‌ల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీరే ఆ మాట అంటారు.

ఒక వారం అంతా దేశంలో ఇష్టానుసారం తిరిగేసి వెన‌క్కి వెళుతున్న కేటీ .. ముంబై విమానాశ్ర‌యంలో ట్రాక్ సూట్ లో.. బేస్ బాల్ క్యాప్ తో స్పోర్ట్స్ క్వీన్ లా ప్ర‌త్య‌క్ష‌మైంది. అలాగే విమానాశ్ర‌యంలో అభిమానుల‌కు ఆటోగ్రాఫ్ లు ఇచ్చింది. కేటీని చూడ‌గానే అభిమానులు మీద ప‌డ్డారు. ఇక తాను తిరిగి వెళుతూ ఉంటే అక్క‌డ పోలీస్ అధికారి త‌నని పాస్ పోర్ట్ చూపించ‌మ‌ని అభ్య‌ర్థించాడు. అయితే తాను అదేమీ ప‌ట్టించుకోకుండా వెళ్లిపోతోంది. అయినా అత‌డు వెంట‌ప‌డి మ‌రోసారి క్యాటీ అసిస్టెంట్ ని అభ్య‌ర్థిస్తే తాను ఎందుకు ఏదో చెప్పి వెళ్లిపోయాడు.

మొత్తానికి ఈ వ్య‌వ‌హారం కాస్తా ఎవ‌రో వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్ట‌డంతో పెద్ద దుమార‌మే రేగుతోంది. కేటీ త‌ల‌బిరుసేమిటి? అంటూ నెటిజ‌నం విరుచుకుప‌డుతున్నారు. అమెరికా విమానాశ్ర‌యంలోనూ ఇలానే చేస్తుందా ఈ అమ్మడు. మ‌న‌వాళ్లు వ‌దిలేసినంత తేలిగ్గా అక్క‌డ వ‌దిలేస్తారా? విమానాశ్ర‌యాల్లో ఎన్నోసార్లు ఖాన్ అని పేరు పెట్టుకున్న మ‌న ఖాన్ ల త్ర‌యాన్ని వ‌దిలిపెట్ట‌కుండా పాస్ పోర్టులు క‌లెక్ట్ చేసుకున్నారు పోలీస్. ఆ సంఘ‌ట‌న‌ల్ని అభిమానులు మ‌ర్చిపోలేరు. అంతెందుకు అబ్దుల్ క‌లాం అంత‌టి గొప్ప సైంటిస్టునే భార‌తీయుడు అన్న తేలిక చూపుతో విదేశాల్లో త‌నిఖీలు చేయ‌డం అప్ప‌ట్లో షాక్ కి గురి చేసింది. ఇక మ‌న ఇండియ‌న్ పోలీస్ వీక్ పాయింట్ ని కూడా ఈ సంఘ‌ట‌న బ‌య‌ట పెట్టింది. అస‌లు సెల‌బ్రిటీ అయినంత మాత్రాన అలా పాస్ పోర్ట్ చూపించ‌క పోతే వ‌దిలేస్తారా? అంటూ కొంద‌రు ఆ పోలీసాయ‌న‌కు చుర‌క‌లు వేస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి