52 ఏజ్ లోనూ షాకిస్తున్న పాప్ స్టార్ రొమాన్స్..!

Mon Jul 26 2021 15:11:09 GMT+0530 (IST)

Pop star romance is shaking even in age

హాలీవుడ్ పాప్ సింగర్ .. ప్రఖ్యాత నటి జెన్నీఫర్ లోపేజ్ గురించి ప్రపంచానికి పరిచయం అవసరం లేదు. భారతదేశంలో అసాధారణ ఫాలోయింగ్ ఉన్న పాప్ గాయనిగా వెలుగుతోంది. 90వ దశకంలో ఆమె పాప్ గాయనిగా ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిందే. అప్పట్లో యువతను తన పాప్ గానంతో ఓ ఊపు ఊపారు. ఇప్పటికీ అదే చరిష్మాను మెయింటెన్ చేస్తున్నారు. ప్రస్తుతం జెన్నీ ఫర్ వయసు 52 ఏళ్లు. అయినా జెలో స్కిన్ టోన్ మాత్రం 25 అన్నంతగా మెరిసిపోవడం షాకిస్తోంది. అందుకు కారణం ఆమె కఠోర శ్రమే. ఫిట్ నెస్ ని కాపాడుకోవడంలో జెలో చాలా కేర్ ఫుల్ గా ఉంటారు. టైమ్ టూ టైమ్ జిమ్ యోగా మెడిటేషన్ ని దైనందిన జీవతంలో ఓ భాగంగా భావిస్తారు.ఆరోగ్యమైన ఆహార విధానం తనకు తొలి నుంచి అలవాటు. ప్రస్తుతం పూర్తిగా సేంద్రియ ఆహార పదార్ధాలే ఆమె డైట్. ఆమె తొలి నుంచి నాన్ ఆల్కాహాలిక్.. స్మోకింగ్ కి దూరంగా ఉంటారు. అందుకే జెన్నీ 52 ఏళ్ల వయసులోనూ అంత అందంగా కనిపిస్తున్నారు. చర్మం లో ఎక్కడా ముడతలు కన్పించవు. ఆ రకంగానే జెలో ఎంతో మంది బాలీవుడ్ నటీమణులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మలైకా ఆరోరా- నోరా ఫతేహీ- అమృతా ఆరోరా- నీలం కోఠారీ- తమన్నా లకు ఆమె ఎంతో ఆదర్శం.

మోస్ట్ ట్యాలెంటెడ్ బ్యూటీ జెన్నీఫర్ లోపెజ్ శనివారంతో 52 వ పడిలోకి అడుగు పెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా బెస్ట్ విషెస్ తెలియజేసారు. ఈ సందర్భంగా జెన్నీఫర్ కు చెందిన కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ఇక జెన్నీ ఫర్ లోపేజ్ ప్రియుడితో ఏకాంతంగా గడిపిన ఓ ఫోటోని ఇన్ స్టా వేదికగా పంచుకుంది. ప్రియుడు బెన్ ఆప్లికన్ తో కలిసి పడవలో ఆలా విహరిస్తూ కనిపించింది. ఇందులో జెలో టూపీస్ లో హాట్ హాట్ గా దర్శనమిచ్చారు. బెన్ ఆప్లికన్ కౌగిలిలో మునిగిపోయిన జెన్నీఫర్ ప్రియుడితో ఘాటైన లిప్ లాక్ లోనూ లాక్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. నెటిజనులు వేడెక్కించే జెలో ఫోటోలపై తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో అలానే..:

జెన్నీఫర్ లోపెజ్ క్రేజ అంతకంతకు పెరుగుతోందే కానీ తరగడం లేదు. అందుకు కారణం వయసు పెరిగినా ఆమె హాట్ నెస్ మాత్రం ఇంకా తగ్గ లేదు. 20 ఏళ్ల క్రితం కెడ్ కార్పెట్ పై ఎలా హొయలు పోయిందో అంతకు మించిన స్థాయిలో తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేయడమే.

మిలాన్ లో సమ్మర్ ఫ్యాషన్ వీక్ రెడ్ కార్పేట్ పై గ్రీన్ కలర్ ఆకులాంటి డిజైనర్ డ్రెస్ లో బ్రా లెస్ ఫోజులో జెన్నీఫర్ లోపేజ్ క్యాట్ వాక్ చేసిన ఫోటోలు ఇప్పటికీ హాట్ టాపిక్ . 20 ఏళ్ల క్రితం ఏ స్థాయిలో తన అందాల ప్రదర్శనతో ఆకట్టుకుందో అదే స్థాయికి ఏ మాత్రం తగ్గని అందాలతో ఆకట్టుకోవడం అక్కడున్న వారిని షాక్ కు గురిచేసింది. ర్యాంప్‌పై జెన్నీ నడుస్తుంటే ఆమె అందాలని తమ కెమెరాల్లో బంధించాలని కిడ్స్ నుంచి వయసు మళ్లిన వాళ్లు కూడా ప్రయత్నించి నోరెళ్లబెట్టి తన్మయత్వానికి లోనయ్యారు.

ఇన్నేళ్లయినా వన్నెతరగని అందాలతో జెన్నీఫర్ లోపేజ్ మెస్మరైజ్ చేస్తోందని మురిసిపోయారు. జేలో నటించిన `హాస్ట్ లర్స్` చిత్రాన్ని మలేషియాలో బ్యాన్ చేశారు. సినిమాలో అత్యధికంగా అడల్ట్ కంటెంట్ వున్న కారణంగా ఆ చిత్రాన్ని తమ దేశంలో బ్యాన్ చేస్తున్నట్టు ఆ దేశ గవర్నమెంట్ ప్రకటించింది.