వారి ఆంక్షలు.. హాట్ బ్యూటీ సొంత దుఖాణం

Mon Jun 10 2019 11:37:02 GMT+0530 (IST)

Poonam Pandey Opens Own Website For Her Videos Promotion

ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్ పూనం పాండే హాట్ ఫొటో షూట్ లకు పరిమితం అయ్యేది. ఆ తర్వాత మెల్ల మెల్లగా హాట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలు పెట్టింది. ఆ వీడియోల హాట్ నెస్ మరీ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా సైట్స్ అయిన ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ లు పూనం అకౌంట్స్ ను బ్లాక్ చేయడం జరిగింది. గత కొన్నాళ్లుగా ఇన్ స్టా గ్రామ్ లో తన హాట్ వీడియోలను పోస్ట్ చేస్తుంది. ఇన్నాళ్లు హాట్ వీడియోలు పోస్ట్ చేసిన ఈ అమ్మడు ఇకపై న్యూడ్ వీడియోలను పోస్ట్ చేయాలని భావిస్తుంది. అందుకోసం ఈ అమ్మడు సొంతంగా ఒక వెబ్ సైట్ ను ప్రారంభించింది.సోషల్ మీడియాలో తన అందాలపై ఆంక్షలు పెడుతున్న నేపథ్యంలో తాను కొత్తగా సొంతంగా సైట్ ను పెడుతున్నట్లుగా ప్రకటించింది. 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే తన సైట్ లోకి ఎంట్రీ ఉంటుందని ఆమె కండీషన్ పెట్టింది. సైట్ లోని కొన్ని వీడియోలు మరియు ఫొటోలు ఫ్రీగా చూడవచ్చు. మరి కొన్ని వీడియోలు మరియు ఫొటోలను చూడాలి అంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

సినిమాల్లో అవకాశాలు లేకున్నా కూడా పూనం పాండే ఇన్నాళ్లు సోషల్ మీడియాలో చేస్తూ వచ్చిన కామెంట్స్ మరియు ఇతరత్ర హాట్ ఫొటోల కారణంగా ఫేమస్ అవుతూ వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు.. న్యూడ్ ఫొటోలకు ఆంక్షలు ఉన్న నేపథ్యంలో సొంత వెబ్ సైట్ తో డబ్బులు సంపాదించాలని చూస్తోంది. ఈ అమ్మడు మొత్తానికి తన అందాల ప్రదర్శణతో మీడియాలో ఉంటూ.. డబ్బులు కూడా సంపాదిస్తూ వస్తోంది.