ఫోటో స్టొరీ: పెళ్ళికూతురిగా.. సూపర్ ఫన్

Mon Apr 22 2019 13:33:52 GMT+0530 (IST)

Poonam Kaur in Bridal Wear

పూనమ్ కౌర్ పేరు తెలియని తెలుగువారు దాదాపుగా ఉండరు. అసలు జన్మలో పూనమ్ కౌర్ నటించిన సినిమా చూడని తెలుగువారు కూడా ఏదో ఒక సందర్భంలో పూనమ్ కౌర్ పేరు వినే ఉంటారు.  కారణం.. ఆమె చుట్టూ నెలకొన్న వివాదాలే.  ఇప్పుడు అవన్నీ ప్రస్తావించి అసలే అంతంతమాత్రంగా ఉన్న మీ 'మండే' మూడ్ ను ఇంకా చెడగొట్టడం భావ్యం కాదు.  అందుకే ఆమె పెళ్లి సందడి గురించి మాట్లాడుకుందాం.



పెళ్ళిసందడి అనగానే పూనమ్ కౌర్ పెళ్ళి చేసుకుంటోందని ఫిక్స్ అయిపోకండి.  పెళ్ళికూతురు వస్త్రధారణలో ఈమధ్య ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.  దీనికి పూనమ్ ఇచ్చిన క్యాప్షన్ "న్యూ యార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో పెళ్ళి కూతురిలా తిరగడం.. సూపర్ ఫన్" అని క్యాప్షన్ ఇచ్చింది. హెరిటేజ్ ఇండియా ఫ్యాషన్స్ వారి దుస్తులు ధరించి ఈ ఫోటో షూట్ లో పాల్గొంది పూనమ్.  తెలుపు రంగు ఛోళీ.. ఎరుపు రంగు బ్రైడల్ లెహెంగాలో నిజంగానే పెళ్ళి కూతురిలా ఉంది. గాల్లోకి ఎగురుతున్న ఆమె హెయిర్ ఈ ఫోటో కు మరింత అందాన్ని తీసుకొచ్చింది.

ఈ ఫోటోను చూసి ఒక నెటిజన్ ఎగ్జైట్ అయ్యి "(షాదీ) కబ్ కబ్?" అని అడిగితే..  "వెరీ సూన్" అని రిప్లై ఇచ్చింది.  అర్థం అయింది కదా.. త్వరలోనే వివాహానికి రెడీ అని చెప్తోంది. ఈ నటన.. వివాదాలు అన్నీ చూసి బుర్ర హీటెక్కిందేమో.  కానీ ఈ భామకు తెలియని విషయం ఏంటంటే.. పెళ్ళి చేసుకుంటే 'కాంచన 3' లో లారెన్స్ గారు డబల్ మాస్ అని శెలవిచ్చినట్టుగా పూనమ్ కు 'డబల్ హీట్' అవుతుంది. ఆ హీటు ముందు ఈ వివాదాల హీటు జస్ట్ జుజుబి అనిపిస్తుంది!