వేశ్య కంటే దారుణం అంటూ పూనమ్ తిట్లు

Sat May 30 2020 09:45:41 GMT+0530 (IST)

Poonam Kaur Vs Sri Reddy

``ఫ్రీడమ్ అని అమ్మా నాన్నను వదిలేసి.. డబ్బు అని క్యారెక్టర్ ని వదిలేసిన అమ్మాయి ఒక వేశ్య కంటే దారుణం. మనిషిగా మారు మృగమా`` అంటూ చీవాట్లు పెట్టేసింది పూనమ్ కౌర్. గత కొంతకాలంగా వరుస ట్వీట్లతో స్పీడ్ మీద ఉన్న పూనమ్ ఉన్నట్టుండి ఇలా ఎవరిపై విరుచుకుపడింది? అంటే.. నెటిజనులు మాత్రం ఈ తిట్లు అన్నీ తన విరోధి శ్రీరెడ్డిపైనేనని చెబుతున్నారు.``ఓ కూతురుగా ఉండటం ఒక బాధ్యత.. ఒక చెల్లిగా ఉండటం ఒక బాధ్యత.. ఒక ప్రేయసి.. భార్యగా ఉండటం ఒక బాధ్యత.. బాధ్యత ప్రేమతో క్యారెక్టర్ వస్తది`` అంటూ పూనమ్ కౌర్ ఓ రేంజులోనే క్లాస్ తీస్కుంది తాజా ట్వీట్ లో. వేశ్య కంటే దారుణం!! అన్న వ్యాఖ్యను బట్టి ఇదంతా శ్రీరెడ్డినుద్ధేశించేనంటూ నెటిజనులు పోస్టులు పెడుతున్నారు. అందుకు కారణం కూడా ఉంది.

పూనమ్ మొన్నటికి మొన్న పీకే మాస్క్ ధరించిన ఫోటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో దానిపై శ్రీరెడ్డి పంచ్ లు వేసింది. ``పూనమ్ అక్కా.. పీకే మాస్క్ వేసుకోవడం ఎందుకు? మా అందరికీ పీకే కి ఉన్న మాస్క్ తీసేయ్ అంటే తీయవు.. మాస్క్ కే పీచ్ క్యా హై??`` అంటూ సెటైర్ వేసింది. దీనికి కౌంటర్ కోసం వేచి చూసిన పూనమ్ ఇలా ``వేశ్య.. దారుణం!!`` అంటూ తిట్టేసిందని భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. కత్తి మహేష్ .. వీరందరితో పూనమ్ కౌర్ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. వాటితోనే నటిగా ఫేడవుట్ అయిన తనకు బోలెడంత ఇమేజ్ వచ్చింది. సినిమా టీవీ అవకాశాలు కూడా అందుకుంది. ప్రస్తుతం శ్రీరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిందిగా అంటూ నెటిజనులు ఒకటే కామెంట్లు గుప్పిస్తున్నారు. మరి ఈ ఎపిసోడ్ లో పూనమ్ తిట్టేసింది ఎవరిని?.. అన్నదానికి పూనమ్ కానీ శ్రీరెడ్డి కానీ స్పందించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి వినోదం యూత్ కి కొదవేమీ లేదు.