బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసి షాక్ ఇచ్చిన పూనమ్ బజ్వా..!

Wed Oct 28 2020 18:30:36 GMT+0530 (IST)

Poonam Bajwa shocked by introducing boyfriend ..!

'మొదటి సినిమా' అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది అందాల ముద్దగుమ్మ పూనమ్ బజ్వా. ఆ తర్వాత కింగ్ నాగార్జున సరసన 'బాస్' సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ప్లాప్ అవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కాకపోతే 'వేడుక' 'పరుగు' 'ఎన్టీఆర్ కథానాయకుడు' వంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించింది. అయినప్పటికీ ఎందుకో పూనమ్ తెలుగులో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కాకపోతే తమిళ మలయాళ కన్నడ ఇండస్ట్రీలలో మాత్రం తన బొద్దు అందాలతో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు టచ్ లో ఉంటూనే ఉంటుంది. మూడు పదుల వయసు దాటిన ఈ బ్యూటీ తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

నేడు తన ప్రియుడు సునీల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తమ మధ్యనున్న సంబంధాన్ని వెల్లడించి అభిమానుల హార్ట్ బ్రేక్ చేసింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రియుడికి బర్త్ డే విషెష్ చెప్పిన పూనమ్ సునీల్ రెడ్డితో కలిసి ఉన్న కొన్ని రొమాంటిక్ ఫోటోలను ఫస్ట్ టైం షేర్ చేసింది. స్విమ్మింగ్ ఫూల్ లో కలిసి ఎంజాయ్ చేస్తున్న పిక్స్.. ఒకరినొకరు కిస్ చేసుకుంటున్న ఫోటోలు పోస్ట్ చేసి ప్రపంచానికి ఫ్యాన్స్ కి పూనమ్ తన బాయ్ ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ''బర్త్ డే గ్రీటింగ్స్ సునీల్. ఈ అందమైన వ్యక్తికి అందమైన మనసు నా భాగస్వామి లైఫ్ మేట్ రొమాంటిక్ డేట్ ప్లే మేట్ సోల్ మేట్. నేను మీ కోసం ఉద్దేశించాను ఆనందం మంచి ఆరోగ్యం ఉత్సాహం ప్రేమ సరదా ఉల్లాసమైన ఈ క్షణం నుండి ప్రయాణం ఫరెవర్! ఐ లవ్ యూ!'' అని పూనమ్ బజ్వా తన బాయ్ ఫ్రెండ్ కి శుభాకాంక్షలు తెలిపింది.