చక్కనమ్మ విరహంగా అలా ఒళ్లు విరుచుకుంటే

Sat Jul 31 2021 05:00:02 GMT+0530 (IST)

Poonam Bajwa On Instagram

నటి పూనమ్ బజ్వా ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు చేయకపోయినా.. నిరంతరం సోషల్ మీడియాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. బబ్లీ లుక్ లో చూపరులను ఆకట్టుకునే ఈ బ్యూటీ నిరంతరం వేడెక్కించే ఫోటో షూట్లతో చెలరేగుతోంది.బికినీ.. టూపీస్... యోగా.. జిమ్ముల్లో వర్కౌట్ వీడియోలతో కుర్ర కారుని  హీటెక్కిస్తూనే ఉంటుంది. పొట్టి నిక్కర్లలో పూనమ్ తళుకుబెళుకులు ఫ్రెష్ ఫీల్ ని తీసుకొస్తుంటాయి. తాజాగా మరోసారి ఇన్ స్టా వేదికగా పూనమ్ చెలరేగిపోయింది.

డెనిమ్ జీన్స్ .. మూడివేసిన టీషర్ట్ తో కుర్రాళ్లని మత్తెక్కిస్తోన్న ఫోటో వైరల్ గా మారింది. పూనమ్ అలా ఒళ్లు విరుచుకుంటే నాభి అందం హైలైట్ గా ఎలివేట్ అయ్యింది మరి. నడువొంపు సొంపులతో ఎలివేషన్ హాట్ టాపిక్ గా మారింది. అప్పుడే బెడ్ పై నుంచి లేచొచ్చి ఒళ్లు విరుచుకుంటోన్న లుక్ లో చూపరులను పూనమ్ ఆకట్టుకుంటోంది. పూనమ్ అందాలపై నెటిజనులు వేడెక్కించే కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు.

ఇక పూనమ్ నటవృత్తి విషయానికి వస్తే.. ప్రస్తుతం మలయాళంలో `పాతోన్ పాతమ్ నుట్టానుండ్` అనే ఒకే సినిమాలో నటిస్తోంది.  ఇది చారిత్రక నేపథ్యంతో కూడిన  సినిమా. భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నారు. ఇక మలయాళంలో అగ్ర హీరోల సరసన నటించిన పూనమ్ తెలుగులో నవదీప్ సరసన తెలుగులో `మొదటి సినిమా`తో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత పరుగు - ఎన్టీఆర్ బయోపిక్ `కథానాయకుడు` చిత్రాల్లో నటించింది. అలాగే పలు మీడియం బడ్జెట్ సినిమాల్లోనూ నటించింది. కానీ ఇక్కడ అనుకున్నంత స్టార్ డమ్ రాలేదు. దీంతో ఇతర భాషా చిత్రాలపై దృష్టి పెట్టింది. తమిళ్- కన్నడ భాషల్లోనూ  కొన్ని సినిమాలు చేసింది. అయితే  హిందీలో మాత్రం ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు.