ఫ్లోరల్ షార్ట్ చినుగుల టీస్ లో పూనమ్ ఇస్టయిల్

Wed Jun 09 2021 08:00:01 GMT+0530 (IST)

Poonam Bajwa Latest Photo

నాగార్జున సరసన బాస్ చిత్రంలో నటించిన పూనమ్ బజ్వా తెలుగు-తమిళం-మలయాళంలో పలు క్రేజీ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడులో అతిథిగా మెరిసిన పూనమ్ బజ్వా.. మళ్లీ తెలుగులో కనిపించలేదు. ప్రస్తుతం మలయాళంలో పలు చిత్రాలతో బిజీగా ఉందీ బ్యూటీ.మలయాళంలో ప్రస్తుతం `పతోంబతామ్ నూతండు` అనే చిత్రంలో నటిస్తోంది. ఇక గత ఏడాది దర్శకుడు సునీల్ రెడ్డి బర్త్ డే సందర్భంగా పూనమ్ తో ప్రేమాయణం విషయాన్ని అధికారికంగానే ప్రకటించారు. ఇక సోషల్ మీడియాల్లోనూ పూనమ్ జరంత స్పీడ్ గానే ఉన్నారు. రెగ్యులర్ గా ఇన్ స్టా వేదికగా వేడెక్కించే ఫోటోషూట్లతో అభిమానులకు టచ్ లో ఉన్నారు. తాజాగా ఫ్లోరల్ షార్ట్ చినుగుల టీస్ లో పూనమ్ ఇస్టయిల్ అభిమానుల్లో చర్చకు వచ్చింది. పూనమ్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇక తమిళంలో త్రిష- హన్షిక ప్రధాన పాత్రల్లో నటించిన ఆరణ్మయి 2లో పూనమ్ ఓ ఆసక్తికర పాత్రలో నటించింది. సుందర్ సి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 2016లో రిలీజైన ఈ చిత్రానికి మంచి ప్రశంసలు దక్కాయి. సుందర్ సి దర్శకత్వంలోనే పూనమ్ నటించే అవకాశం ఉందని తెలిసింది.