Begin typing your search above and press return to search.

కేవలం చొక్కాతో చెమటలు పట్టిస్తా!

By:  Tupaki Desk   |   3 April 2020 3:30 AM GMT
కేవలం చొక్కాతో చెమటలు పట్టిస్తా!
X
పూనమ్ బజ్వా. తెలుగుతెరకు పరిచయం అక్కర్లేని పేరు. నవదీప్ హీరోగా తెరకెక్కిన 'మొదటి సినిమా' అనే సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసి తర్వాత నాగార్జున 'బాస్' సినిమాలో హీరోయిన్ గా నటించింది. పూనమ్ తన అందంతో అభినయంతో ఎప్పటికప్పుడు అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. కానీ అందరు హీరోయిన్లలాగే పూనమ్ కూడా మొదట్లో మంచి తెలుగుతనం నిండిన పక్కింటి అమ్మాయిలా కనిపించింది. వరుస సినిమాలతో జోరుమీద ఉన్నప్పుడే గ్లామర్ పాత్రలు చేస్తూ, అందాల విందును ప్రారంభించింది. కానీ ఎంత అందం గుప్పించినా అమ్మడికి తెలుగులో మాత్రం అవకాశాలు ఎందుకు కరువయ్యాయో జవాబు తెలియని ప్రశ్న.

చివరిసారిగా పరుగు సినిమాలో కన్పించిన పూనమ్. తర్వాత తమిళంలో ఫుల్ బిజీ అయిపోయింది. అడపాదడపా కన్నడ, మలయాళం సినిమాలలో కూడా మెరిసింది. ప్రస్తుతం పూనమ్ బేబీ హాట్ అందాలను బాగా మిస్ అవుతున్నామని అభిమానులు బెంగ పెట్టుకున్నారు. పూనమ్ మాత్రం ఇంస్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉండటానికే ట్రై చేస్తుంది. హాట్ హాట్ ఫోటోషూట్లతో, అదిరిపోయే ఫోజులతో ఫ్యాన్స్ కి అందాల విందు వడ్డిస్తూనే ఉంది. తాజాగా పూనమ్ కేవలం వైట్ షర్ట్ వేసుకొని బెడ్ పై కూర్చొన్న పోజుతో దర్శనమిచ్చింది. తెల్ల చొక్కాలో తన ఎద పొంగులను ప్రదర్శిస్తూ, ఒంపులన్నీ బయటపడేలా కెమెరా వైపు సెక్సీ లుక్స్ తో ఫోజిచ్చే సరికి అభిమానుల బాడీలో సెగలు పుట్టుకొస్తున్నాయి. నీ సొగసులన్ని సినిమాలలో చూస్తే బాగుండు అని ఫ్యాన్స్ వాపోతున్నారు. మరి ఈ వార్త అమ్మడి చెవిన పడిందో లేదో..!