Begin typing your search above and press return to search.

అలా ఆద‌మ‌రిచి నిదురిస్తే కుర్రాళ్ల కంటికి కునుకేల‌!

By:  Tupaki Desk   |   24 Sep 2021 11:30 AM GMT
అలా ఆద‌మ‌రిచి నిదురిస్తే కుర్రాళ్ల కంటికి కునుకేల‌!
X
అవును.. అందాల ఆడ‌బొమ్మ‌.. అలా ఆద‌మ‌రిచి నిదురిస్తే కుర్రాళ్ల కంటికి కునుకేల‌!.. అందంగా క‌వ్విస్తుంది.. కుర్రాళ్ల గుండెల్ని గుల్ల చేస్తుంది. న‌టిగానూ సీనియారిటీ ఉంది. కానీ ఎందుక‌నో టాలీవుడ్ లో పెద్ద స్టార్ కాలేక‌పోయింది.

స్టార్ హీరోయిన్ కావాల‌న్న క‌ల‌ల్ని నిజం చేసుకోవ‌డంలో ఎందుక‌నో పూన‌మ్ బ‌జ్వా త‌డ‌బ‌డింద‌నే చెప్పాలి. అయితే మాలీవుడ్ లో మాత్రం అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించి త‌న ఉనికిని చాటుకుంది బ‌జ్వా.

తాజాగా పూన‌మ్ బ‌జ్వా షేర్ చేసిన ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. పూన‌మ్ అలా ఆద‌మ‌రిచి నిదురిస్తోంది. చ‌క్క‌న‌మ్మ మ‌రీ అలా ప‌గ‌లే క‌ల‌లు కంటోందా? అంటూ అభిమానులు సందేహిస్తున్నారు. రెడ్ షార్ట్.. నావీ బ్లూ టాప్ తో పూన‌మ్ ఎంతో హాట్ గా క‌నిపిస్తోంది. అయినా అలా ఆద‌మ‌రిచి నిదురిస్తే కుర్రాళ్ల కంటికి కునుకేల‌! అంటూ కామెంట్లు జోరెక్కిపోతున్నాయ్.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే..

న‌వ‌దీప్ న‌టించిన `మొద‌టి సినిమా`తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ త‌రువాత కింగ్ నాగార్జున‌ న‌టించిన `బాస్‌` చిత్రంలో న‌టించి ఆక‌ట్టుకుంది. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం ఆవ‌కాశాల్ని ద‌క్కించుకోలేక‌పోయింది. ఆ త‌రువాత త‌మిళ ఇండ‌స్ట్రీ బాట ప‌ట్టిన పూన‌మ్ అక్క‌డే న‌టిగా స్థిర‌ప‌డిపోయింది. పాపుల‌ర్‌ డ్యాన్స్ మాస్ట‌ర్ బాబా భాస్క‌ర్ తొలిసారి డైరెక్ట్ చేసిన `కుప్పాత్తురాజా` చిత్రంలో యువ సంగీత ద‌ర్శ‌కుడు జీవి ప్ర‌కాష్ కుమార్ కు జోడీగా న‌టించింది.

వీరిద్ద‌రి మ‌ధ్య చిత్రీక‌రించిన హాట్ హాట్ స‌న్నివేశాలు యువ‌త‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. త‌మిళ‌- మ‌ల‌యాళ భాష‌ల్లో న‌టిస్తూ య‌మ బిజీగా వున్న పూన‌మ్ భ‌జ్వా క‌మ‌ర్ష‌య‌ల్ యాడ్స్ లోనూ న‌టిస్తూ స‌త్తా చాటుకుంటోంది. క్రేజీ నాయిక‌గా గుర్తింపుని ద‌క్కించుకోలేక‌పోయినా క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. అల్లాన్స్ వేర్స్ బ్రాండ్ కోసం స‌న్యాసినిగా పింక్ క‌ల‌ర్ డ్రెస్ లో మెడ‌లో రుద్రాక్ష,.. బంతిపూల మాల ధ‌రించి హొయ‌లు పోతున్న పోస్ట్ చేసిన పూన‌మ్ భ‌జ్వా ఇటీవ‌ల షేర్ చేశారు. ప్ర‌స్తుతం హిస్టారిక‌ల్ పీరియాడిక‌ల్ కాన్సెప్టుతో రూపొందుతున్న ప‌టోన్ ప‌టు నూటండ అనే మ‌ల‌యాళ చిత్రంలో పూన‌మ్ న‌టిస్తోంది.