Begin typing your search above and press return to search.

రవితేజ కు విలన్ గా 'రంగస్థలం' బ్యూటీ..?

By:  Tupaki Desk   |   20 Jan 2022 7:55 AM GMT
రవితేజ కు విలన్ గా రంగస్థలం బ్యూటీ..?
X
మాస్ మహారాజా ర‌వితేజ హీరోగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''రావ‌ణాసుర''. సంక్రాంతి సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇందులో రవితేజ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించనున్నారు. అయితే ఈ సినిమాలో ఓ యంగ్ బ్యూటీ విలన్ గా నటిస్తోందని టాక్ వినిపిస్తోంది.

ఇటీవల కాలంలో హీరోయిన్స్ కేవలం గ్లామర్ రోల్స్ కాకుండా నటనకి ఆస్కారం ఉన్న అన్ని రకాల పాత్రలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ విలన్ పాత్రలు కూడా చేశారు. రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్’ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ గా నటించగా.. ఇప్పుడు ‘రావణాసుర’ చిత్రంలో పూజిత పొన్నాడ విల‌న్ క్యారెక్ట‌ర్ చేస్తున్నట్లు సమాచారం.

వైజాగ్ ప్రాంతానికి చెందిన తెలుగమ్మాయి పూజిత పొన్నాడ 'దర్శకుడు' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత 'రంగస్థలం' 'కల్కి' వంటి సినిమాలలో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అర డజనుకు పైగా చిన్నా చితక చిత్రాల్లో నటిస్తున్న పూజిత.. ఇప్పుడు ''రావణాసుర'' చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందని అంటున్నారు.

ఇంతకముందు రవితేజ సినిమాలో విలన్ పాత్ర కోసం 'హుషారు' 'జాంబిరెడ్డి' 'బంగార్రాజు' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ద‌క్ష న‌గార్క‌ర్‌ ను తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు లోక‌ల్ బ్యూటీ పూజిత పొన్నాడ విల‌న్ గా చేస్తోందని టాక్ వచ్చింది. మరి ఈ ఇద్దరు ముద్దుగుమ్మల్లో ఎవరు విలనో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

ఇకపోతే రావణాసుర'' సినిమాలో పూజిత పొన్నాడ - దక్ష నగర్కార్ లతో పాటుగా అనూ ఇమాన్యుల్ - ఫరియా అబ్దుల్లా - మేఘా ఆకాశ్ వంటి మరో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ యాక్షన్ థ్రిల్లర్ కు కథ అందిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ మరియు ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్స్ అభిషేక్ నామా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.