రౌడీ స్టార్ బుట్టబొమ్మ కన్ఫర్మ్ అయినట్లేనా?

Mon May 16 2022 14:00:43 GMT+0530 (IST)

Pooja hegde on vijay devarakonda movie

విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. లైగర్ సినిమా ను ఆగస్టు లో విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు పూరి జగన్నాద్ అధికారికంగా ప్రకటించాడు. మరో వైపు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 'ఖుషి' అనే సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. ఖుషి సినిమా తర్వాత రౌడీ స్టార్ మళ్లీ పూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.ఇప్పటికే విజయ్ దేవరకొండ.. పూరిల కాంబోలో రెండవ సినిమా జనగణమన పట్టాలెక్కబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. ఆ మద్య జనగణమన సినిమా కు సంబంధించిన హడావుడి చేసిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఆ సినిమా షూటింగ్ ను జులై లో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి షెడ్యూల్ లో హీరోయిన్ పూజా హెగ్డే పాల్గొనబోతుందని కూడా సమాచారం అందుతోంది.

జనగణమన సినిమాలో పూజా హెగ్డే నటించబోతున్నట్లుగా ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు చిత్ర యూనిట్ సభ్యుల నుండి అనధికారికంగా షూటింగ్ లో పూజా హెగ్డే పాల్గొనబోతుంది అంటూ క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. పూజా హెగ్డే ప్రస్తుతం సౌత్ లో వరుసగా సినిమాలు చేయడంతో పాటు నార్త్ లో కూడా పలు సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.

పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న పూజా హెగ్డే జనగణమన సినిమాకు అదనపు ఆకర్ణ్గా నిలుస్తుందనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ సభ్యులు ఆమెను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. జనగణమన సినిమా భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందించబోతున్నారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా వ్యవహిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

పూజా హెగ్డే మరియు విజయ్ దేవరకొండ కాంబో లో సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో సమంతతో రొమాన్స్ చేస్తున్న విషయం తెల్సిందే. జనగణమన సినిమాలో పూజా హెగ్డేను దర్శకుడు పూరి జగన్నాద్ చాలా విభిన్నంగా.. అందంగా.. అందాల ప్రదర్శన విషయంలో అంతకు మించి అన్నట్లుగా చూపించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. వచ్చే ఏడాది లో ఈ జనగణమన విడుదల అయ్యే అవకాశం ఉంది.