Begin typing your search above and press return to search.

కేన్స్ 2022 లో బుట్ట‌బొమ్మ మెరుపులు

By:  Tupaki Desk   |   17 May 2022 10:32 AM GMT
కేన్స్ 2022 లో బుట్ట‌బొమ్మ మెరుపులు
X
ప్ర‌తిష్ఠాత్మ‌క కేన్స్ ఫిలింఫెస్టివ‌ల్స్ 2022లో సెల‌బ్రిటీ హంగామా పీక్స్ కి చేర‌నుంది. ఈసారి బాలీవుడ్ నుంచి ఎవ‌రెవ‌రు అటెండ‌వుతున్నారు? అన్న‌దానికి తాజాగా ఆన్స‌ర్ దొరికింది. కేన్స్ 2022లో బాలీవుడ్ ప్రముఖుల్లో ఎప్ప‌టిలానే ఐశ్వర్య రాయ్ బచ్చన్- ఏ.ఆర్.రెహ‌మాన్ ఇప్ప‌టికే ఖాయ‌మ‌య్యారు.

అభిషేక్ బచ్చన్ -కుమార్తె ఆరాధ్య బచ్చన్ ల‌తో క‌లిసి ఐష్‌ గత రాత్రి కేన్స్ 2022కి వెళ్లేందుకు విమానాశ్రయంలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా కేన్స్ 2022కి వెళ్లే విమానాశ్రయంలో ఉన్నారు. వారి ఎయిర్ పోర్ట్ లుక్ లు ఇప్ప‌టికే లీక‌య్యాయి.

కేన్స్ 2022లో ఈసారి సంద‌డి చేయ‌బోయే సౌత్ స్టార్ ఎవ‌రు? అంటే.. రాధే శ్యామ్ బ్యూటీ.. మ‌న బుట్ట‌బొమ్మ‌ పూజా హెగ్డే. 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పూజా తొలిసారి అరంగేట్రం చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.

ఫిల్మ్ ఫెస్టివల్ లో తొలిసారిగా కనిపించ‌నున్న‌ సౌత్ బ్యూటీ కి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతుండగా విమానాశ్రయంలో కాస్తంత‌ ఆశ్చర్యానికి గురైంది. అంతేకాదు ఒక అభిమానికి హ‌గ్ ఇచ్చి ఓ మైగాడ్! అంటూ సంబ‌ర ప‌డింది పూజా.

ఐశ్వర్య రాయ్ బచ్చన్ స‌హా గ‌త‌ రాత్రి కేన్స్ 2022కి వెళ్లేందుకు విమానాశ్రయంలో క్లిక్ అయిన ఫోటోల్లో పూజా హెగ్డే ఫోటో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది. కేన్స్ అంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ఉన్న అరుదైన వేడుక‌. ఇలాంటి చోటికి వెళ్లే రేర్ ఛాన్స్ పూజాని వ‌రించింది. అల వైకుంఠ‌పుర‌ములో లాంటి ఇండ‌స్ట్రీ హిట్ లో న‌టించాక పూజాకి గొప్ప గుర్తింపు ద‌క్కింది.

స‌ల్మాన్ ఖాన్ స‌హా ప‌లువురు స్టార్ల స‌ర‌స‌న పూజా అవ‌కాశాలు అందుకుంది. నెమ్మ‌దిగా స్టార్ డ‌మ్ ని విస్త‌రిస్తోంది. అదే క్ర‌మంలో త‌న‌కు కేన్స్ పిలుపు రావ‌డం నిజంగా గొప్ప వ‌రం అని చెప్పాలి. పూజా కూడా ప్రియాంక చోప్రా రేంజులో హాలీవుడ్ సినిమాలు టీవీ సిరీస్ లు చేసే స్థాయికి ఎదిగేయాల‌ని ఆకాంక్షిస్తున్నారు అభిమానులు.