Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : వైట్ బికినీ లో బేబీ బంప్ తో బిగ్‌ బాస్ బ్యూటీ

By:  Tupaki Desk   |   28 Jan 2023 7:00 PM GMT
పిక్ టాక్ : వైట్ బికినీ లో బేబీ బంప్ తో బిగ్‌ బాస్ బ్యూటీ
X
తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ తో పాటు పలు సినిమాలతో సుపరిచితురాలు అయిన పూజా రామచంద్రన్‌ తల్లి కాబోతుంది అనే విషయం ను ఇటీవలే ప్రకటించిన విషయం తెల్సిందే. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే పూజా రామచంద్రన్‌ తన బేబీ బంప్‌ ఫొటోలను షేర్‌ చేసింది.

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ తమ యొక్క బేబీ బంప్‌ తో ఫొటో షూట్స్ చేయించుకోవడం కామన్ విషయం.. వాటిని సోషల్‌ మీడియా ద్వారా జనాలతో షేర్‌ చేసుకోవడం కూడా కొత్తేం కాదు. కానీ ఇలా బికినీ లో తల్లి కాబోతున్న హీరోయిన్‌ బేబీ బంప్ ను చూపించడం మాత్రం చాలా అరుదైన విషయంగా టాక్ వినిపిస్తుంది.

హీరోయిన్‌ గా ఈ మధ్య కాలంలో పెద్దగా ఆఫర్స్‌ దక్కించుకోలేక పోతున్న పూజా రామచంద్రన్‌ తల్లి అయిన తర్వాత సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెడుతుందేమో చూడాలి.

వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా ఈమె కు మంచి స్కోస్ ఉండే అవకాశం ఉంది. స్వామిరారా సినిమా తో తెలుగు వారికి పూజా పరిచయం అయ్యింది.

పూరా రామచంద్రన్‌ సముద్రం లో వైట్‌ బికినీ ధరించి నీటి అలలతో ఆడుకుంటూ తన బేబీ బంప్‌ ను షో చేయడం తో ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

బికినీ లో పూజా రామచంద్రన్‌ చాలా అందంగా ఉందని.. ఇప్పుడు పూజా తల్లి కాబోతున్న నేపథ్యంలో మరింత అందంగా కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.