పిక్ టాక్ : భానుమతి చెల్లి వచ్చేస్తోందోచ్

Sat Dec 04 2021 10:00:01 GMT+0530 (IST)

Pooja Kannan In Chithirai Sevvanam

ఫిదా చేసిన సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చూడ్డానికి అచ్చు సాయి పల్లవిలా కనిపించే పూజా కన్నన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అనే వార్తలు గత కొన్ని రోజులుగా వచ్చాయి. కాని అవి పుకార్లే అయ్యి ఉంటాయని కొందరు భావించారు. కాని షాకింగ్ గా పూజా కన్నన్ నటించిన చితిరై సెవ్వానం సినిమా స్ట్రీమింగ్ అవుతుంది అంటూ ప్రకటన వచ్చేసింది. పూజా కన్నన్ ప్రథాన పాత్రలో తెరకెక్కిన చితిరై సెవ్వానం చిత్రం జీ 5 ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. సముద్ర ఖని కీలక పాత్రలో నటించిన ఈ సినిమా పూజా కన్నన్ లీడ్ రోల్ తో కొనసాగుతోంది. ఆమె నటన మరియు ఆమె పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.చెల్లి సినిమా స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో సాయి పల్లవి ఎమోషనల్ గా సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టింది. చితిరై సెవ్వానం సినిమా ఫొటో మరియు తమ చిన్నప్పటి ఫొటోను షేర్ చేసి తనను హీరోయిన్ గా స్క్రీన్ పై చాలా ఆనందంగా ఉందంటూ ఎమోషనల్ అయ్యింది. తనను ఆధరించినట్లుగానే చెల్లిని కూడా ఆధరించాలి అన్నట్లుగా సాయి పల్లవి కోరింది. మొదటి సినిమా కోసం పూజా కన్నన్ చాలానే కష్టపడ్డట్లుగా తెలుస్తోంది. సింపుల్ లుక్ లో అక్క సాయి పల్లవి మాదిరిగానే సినిమాలో కూడా కనిపించేందుకు పూజా ప్రయత్నించింది. సాయి పల్లవి మేకప్ లేకుండానే ఎక్కువ సినిమాల్లో కనిపించిన విషయం తెల్సిందే. ఇప్పుడు పూజా కన్నన్ కూడా అదే ఫార్ములా ఫాలో అయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి పూజా కన్నన్ ఎంట్రీ సాయి పల్లవికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే ఆమె అభిమానులకు కూడా ఆనందంగా ఉంది.

చితిరై సెవ్వానం సినిమాకు ఫైట్స్ కొరియోగ్రాఫర్ స్టంట్స్ శివ దర్శకత్వం వహించాడు. సింపుల్ గా ఓటీటీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన పూజా కన్నన్ ముందు ముందు రోజుల్లో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక రేంజ్ లో ఎంటర్ టైన్ చేయాలని సాయి పల్లవి అభిమానులు కోరుకుంటున్నారు. చితిరై సెవ్వానం ను తెలుగు ప్రేక్షకులు కూడా సబ్ టైటిల్స్ తో చూసేందుకు సిద్దం అవుతున్నారు. కొందరు సాయి పల్లవికి చితిరై సెవ్వానం సినిమా ను తెలుగు లో డబ్ చేయాల్సిందిగా కూడా కోరుతున్నారు. మొత్తానికి సాయి పల్లవి పోస్ట్ తో చితిరై సెవ్వానం సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది. పూజా కన్నన్ కు సాదర స్వాగతం కూడా లభించింది.