Begin typing your search above and press return to search.

ఏ గొడ‌వా లేకుండా డ‌బ్బింగ్ చెప్పేసిందా?

By:  Tupaki Desk   |   4 Dec 2021 6:19 AM GMT
ఏ గొడ‌వా లేకుండా డ‌బ్బింగ్ చెప్పేసిందా?
X
విక్ర‌మాదిత్య‌- ప్రేర‌ణ జంట ప్రేమ‌క‌థ‌ను విజువ‌ల్ వండ‌ర్ అనిపించే రేంజులో రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కించార‌ని .. `రాధేశ్యామ్` సెన్సేష‌న్స్ ఖాయ‌మ‌నే టాక్ ఇప్ప‌టికే ఫిలింస‌ర్కిల్స్ లో వైర‌ల్ అవుతోంది. సంక్రాంతి కానుక‌గా `రాధేశ్యామ్` జ‌న‌వ‌రి 14న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే జంట మ్యాజిక్ తెర‌పై ప్ర‌తిఫ‌లించిందా లేదా వీక్షించేందుకు ఇంకెంతో స‌మ‌యం లేదు. ఇప్ప‌టికే నిర్మాణానంత‌ర ప‌నులు వేగంగా పూర్త‌వుతున్నాయి. ప్ర‌చారం ప‌రంగానూ వేగం పెంచింది టీమ్.

ఇటీవల విడుదలైన విక్రమాధిత్య క్యారెక్ట‌ర్ టీజ‌ర్ దాదాపు 60 గంటలకు పైగా యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ గా నిలిచింది. విక్ర‌మాధిత్య‌గా ప్ర‌భాస్.. ప్రేర‌ణ‌గా పూజాహెగ్డే న‌టించ‌గా ఈ జంట న‌డుమ రొమాన్స్ ల‌వ్ ఎలిమెంట్స్ సినిమాలో హైలైట్ కానున్నాయి. ఇది ఎట‌ర్న‌ల్ అనిపించే పూర్తి ప్రేమ‌క‌థా చిత్ర‌మ‌ని తొలి నుంచి టాక్ వినిపిస్తోంది.

తాజా సమాచారం మేర‌కు.. పూజా హెగ్డే త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ ని పూర్తి చేసింది. ఆ మేర‌కు ట్విట్ట‌ర్ ద్వారా వివ‌రాల్ని వెల్ల‌డించింది టీమ్. ఈ సినిమాను గోపి కృష్ణ మూవీస్- యువి క్రియేషన్స్‌ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అన్న‌ట్టు ప్ర‌భాస్ తో పూజా గొడ‌వ‌ప‌డింద‌ని అల‌క‌పానుపు ఎక్కింద‌ని ఇంత‌కుముందు ప్ర‌చార‌మైంది. కానీ ఏ గొడ‌వా లేకుండానే ఇప్పుడు డ‌బ్బింగ్ పూర్తి చేయ‌డం ఆస‌క్తిక‌రం.

ప్రభాస్ త‌దుప‌రి కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అత‌డు వ‌రుస‌గా నాలుగు చిత్రాల‌ను లైన్ లో పెట్టిన‌ సంగ‌తి తెలిసిందే. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ .. తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ 3డి సినిమాల్ని చేస్తున్నారు.

త‌దుప‌రి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగాతో మరో పాన్ ఇండియా చిత్రంలో న‌టించ‌నున్నాడు.