Begin typing your search above and press return to search.

'భాయిజాన్' పేరుతో పూజాహెగ్డే సినిమా..?

By:  Tupaki Desk   |   17 Jun 2021 5:30 AM GMT
భాయిజాన్ పేరుతో పూజాహెగ్డే సినిమా..?
X
ఈ మధ్యకాలంలో సినిమా హీరోలకు హిట్స్ ప్లాప్స్ తో పాటు సెంటిమెంట్స్ కూడా ఎక్కువే అయినట్లు అనిపిస్తుంది. అందుకే సినిమాలు ప్లాప్ అయితే తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్త పడుతున్నారు. అలా జాగ్రత్తపడటం బాగానే ఉంది కానీ టైటిల్స్ చేంజ్ చేస్తే ఫలితం మారుతుంది అనుకోవడంలో ఎంతవరకు నమ్మకం ఉందో అర్ధం కావట్లేదని అంటున్నాయి సినీవర్గాలు. తాజాగా సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే నటిస్తున్న సినిమా విషయంలో అదే జరగనుందని టాక్. అమ్మడు త్వరలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా అవతరించబోతుంది. ఫలానా ఇండస్ట్రీ అనే తేడాలేకుండా ప్రస్తుతం టాలీవుడ్ - కోలీవుడ్ - బాలీవుడ్ స్టార్ హీరోలతో మూవీస్ లైనప్ చేసింది.

ప్రస్తుతం పూజా చేతిలో ఉన్న సినిమాలన్ని పాన్ ఇండియా రేంజివే కావడం విశేషం. కొంతకాలంగా పూజా వరుస హిట్లతో దూసుకుపోతుంది. అయితే ఇటీవలే ఏప్రిల్ చివరివారంలో కరోనా మహమ్మారి సోకి హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లొచ్చింది. సౌత్ టు నార్త్ సూపర్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్నటువంటి పూజా.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. అందుకే అమ్మడి కోసం స్టార్ హీరోలు - మేకర్స్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

కరోనా నుండి పూజాహెగ్డే కోలుకుని ఆరోగ్యంగా ఉంది. అయితే ప్రస్తుతం పూజా కూడా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఫాలోయర్లకు అందుబాటులో ఉంటోంది. త్వరలోనే కొత్త సినిమాల షూటింగ్స్ లో పాల్గొనేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చక్రం తిప్పుతోంది. ఇదివరకు హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ సరసన మొహేంజోదారో - ఇటీవల అక్షయ్ కుమార్ సరసన హౌస్ ఫుల్-4 సినిమాలు చేసింది.

అలాగే ప్రస్తుతం బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో కబీ ఈద్ కబీ దీవాలి - స్టార్ హీరో రన్వీర్ సింగ్ తో సర్కస్ సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవలే సల్మాన్ ఖాన్ రాధే సినిమాతో బిగ్ ప్లాప్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు కబీ ఈద్ కబీ దీవాలి సినిమా చేయనున్నాడు. ఫర్హాద్ సామ్జి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్నట్లు టాక్. అదికూడా కబీ ఈద్ కబీ దీవాలి టైటిల్.. భాయిజాన్ గా మార్చనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుపుతున్నాడట సల్మాన్. చూడాలి మరి ఈసారి పేరు మార్చి అయినా సూపర్ హిట్ కొడతాడేమో..!