ఇంట్లోనే ఉంటూ చెఫ్ గా మారిపోయిన స్టార్ హీరోయిన్...!

Fri Jun 05 2020 19:00:41 GMT+0530 (IST)

Butta Bomma Turns Professional Chef

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో వరుస హిట్స్ తో దూసుకపోతున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ భామ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంది. ఈ ఏడాది తెలుగులో ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో భారీ విజయాన్ని అందకున్న బుట్టబొమ్మ పూజా ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రస్తుతం ఓ డియర్ అనే చిత్రంలో నటిస్తుంది. అలాగే అక్కినేని అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' సినిమాలోనూ కనిపించనుంది. ఇక బాలీవుడ్ లో సైతం ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. రీసెంటుగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతోపాటు తెలుగు స్టార్ హీరోలందరితోనూ నటిస్తున్నది.కాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టీవ్ గా ఉండే ఈ బట్టబొమ్మకు ఉండే ఫాలోయింగ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ తరుచూ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తనలోని ఇతర టాలెంట్ బయటకి తీసే పనిలో పడింది. పూజా హెగ్డే వంట గదిలో దూరి గరిట తిప్పి ఆ మధ్య స్వీట్ హల్వా మరియు పిజ్జా తయారు చేసింది. అంతేకాకుండా తండ్రికి బర్త్ డే సర్ప్రైజ్ ఇచ్చేందుకు స్వయంగా తనే కేక్ రెడీ చేసింది. ఇవే కాకుండా గిటార్ వాయించడం కూడా నేర్చుకుంది. తాజాగా మరో కొత్త రకం వంటతో వచ్చింది పూజా. ఆ వంటను తయారు చేసిన విధానాన్ని సోషల్ మీడియాలో 'కిల్లింగ్ ఇట్' అని షేర్ చేసింది. అంతేకాకుండా తన నానమ్మతో దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ క్రేజీ బ్యూటీ. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.