Begin typing your search above and press return to search.

బీచ్ ఇసుక‌లో `మ‌హ‌ర్షి` బ్యూటీ ట్రీట్

By:  Tupaki Desk   |   24 April 2019 5:43 AM GMT
బీచ్ ఇసుక‌లో `మ‌హ‌ర్షి` బ్యూటీ ట్రీట్
X
బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ ర‌క‌ర‌కాలు. ఒక అంద‌మైన సాయంత్రం సూర్యుడు అస్త‌మించే వేళ‌లోనో.. ఒక‌ వేకువ‌ఝాము సూర్య‌కిర‌ణాలు సూటిగా భూమిని తాకే స‌మ‌యంలోనో బీచ్ ఇసుక‌లో సేద దీరితే ఆ మ‌హ‌త్తే వేరుగా ఉంటుంది. ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న ముంబై ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఆ ప‌నిలోనే ఉంది.

``మీ ఆత్మ‌ను సంతోషంగా ఉంచాలంటే కొంత స‌మ‌యం ఇలా ఆరుబ‌య‌ట‌ స్పెండ్ చేయాలి.. స‌న్ సాండ్ సీ!!`` అంటూ ఇంద్ర‌ధ‌న‌స్సు ఈమోజీని పోస్ట్ చేసింది. మొత్తానికి పూజా ఇచ్చిన టిప్ యూత్ పై బాగానే ప‌ని చేసేట్టుంది. అస‌లే స‌మ్మ‌ర్ హీట్ ఓ రేంజులో ఉంది. అందుకే స్కూల్.. కాలేజ్ గయ్స్ ఈ వేస‌వి సెల‌వుల్లో బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ కోసం గోవా.. పానాజీ వెళ్లేందుకే ఉత్సాహం చూపిస్తున్నారు.

అయితే అంత‌కంటే ముందే పూజా హెగ్డే అస‌లు సిస‌లు విజువ‌ల్ ట్రీట్ పెద్ద తెర‌పైనా అందుబాటులోకి రానుంది. మే 9న `మ‌హ‌ర్షి` చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది కాబ‌ట్టి తెర‌నిండుగా సెల‌బ్రేష‌నే. పూజా ట్రీట్ కోసం అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి కాలేజ్ ఫ్రెండ్ గా క‌నిపిస్తోంది పూజా హెగ్డే. ఇప్ప‌టికే మ‌హేష్ - పూజా- అల్ల‌రి న‌రేష్ ఫ్రెండ్షిప్ పోస్ట‌ర్లు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయిపోయాయి. అర‌వింద స‌మేత త‌ర్వాత పూజాకి న‌టించేందుకు ఆస్కారం ఉన్న‌ మ‌రో ప్రామిస్సింగ్ రోల్ దొరికింద‌నే భావిస్తున్నారు.

తాజాగా పూజా షేర్ చేసిన ఫోటోలో సూర్య కిర‌ణాలు ఇంద్ర‌ధ‌న‌స్సుగా మారి త‌న‌ని తాకుతూ ఇసుక‌లోకి ఇంకిన వైనం మైమ‌రిపిస్తోంది. ఆ రేర్ మూవ్ మెంట్ ని పూజా ఎంజాయ్ చేస్తోంది. ఈ లుక్ లో రెడ్ క‌ల‌ర్ ప‌ర్పుల్ టాప్ తో మైమ‌రిపిస్తోంది. ఈ ఫోటోకి ఓ వీరాభిమాని ఆస‌క్తిక‌ర కామెంట్ ని పోస్ట్ చేశాడు. ప్లీజ్ పూజా నేను మీకు డైహార్టెడ్‌ ఫ్యాన్ ని. అలా ఎక్స్ పోజ్ చేయ‌కండి! అంటూ వ్యాఖ్య‌ను పోస్ట్ చేశాడు. మ‌రి ఈ వ్యాఖ్య‌కు పూజా హెగ్డే ఏమ‌ని రిప్ల‌య్ ఇవ్వ‌నుందో? ప్ర‌స్తుతం ఈ భామ ప్ర‌భాస్ స‌ర‌స‌న జాన్ లో న‌టిస్తోంది. అలానే బాలీవుడ్ చిత్రం హౌస్ ఫుల్ 4 లోనూ న‌టిస్తున్న సంగతి తెలిసిందే.