బుట్టబొమ్మకే ఛాన్సులు ఏంటో గురూజీ

Fri Feb 21 2020 13:15:57 GMT+0530 (IST)

Pooja Hegde To Romance Jr NTR?

ఒకే కథానాయికను పదే పదే రిపీట్ చేస్తే బోలెడన్ని డౌట్లు వచ్చేస్తాయ్. ఆ దర్శకుడికి ఆ కథానాయికతో ఎఫైర్ అంటూ బాలీవుడ్ లో అయితే లింకులు కలిపేస్తారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పదే పదే తన కథానాయికల్ని రిపీట్ చేస్తూ గాసిప్పుల్ని పట్టించుకోడన్న సంగతి తెలిసిందే. ఇదివరకూ ఇలియానా- సమంత లాంటి నాయికల్ని రిపీటెడ్ గానే గురూజీ ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు బుట్టబొమ్మకు అలాంటి ఛాన్స్ దక్కింది. వరుసగా రెండు సినిమాలలో అవకాశం ఇచ్చి.. ఇప్పుడు మూడోసారి పూజానే బరిలో దించేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.అజ్ఞాతవాసి ఫ్లాపయ్యాక.. అరవింద సమేత సక్సెసైంది. ఎన్టీఆర్-పూజా హెగ్దే జంటగా ఫ్యాక్షన్ మూవీతో కంబ్యాక్ అయ్యాడు త్రివిక్రమ్. బన్నీతో అల వైకుంఠపురములో మాయావికి మరో ఊరట. ఈ మూవీలోనూ పూజాకే ఛాన్సిచ్చాడు. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు.. పూజా హెగ్దే వల్లనేనా? అందుకే తనని రిపీట్ చేస్తూ సెంటిమెంటు ఫీలవుతున్నాడా? అంటే.. అవుననే అభిమానులు ఫీలవుతున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల్యాండ్ మార్క్ మూవీకి పూజానే రిపీట్ చేయాలని చూస్తున్నాడట.

ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ముగించి తారక్ అందుబాటులోకి రాగానే గురూజీ సెట్స్ కెళతారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ సాగుతోంది. మరోసారి త్రివిక్రమ్ తన పాత టీమ్ తోనే ముందుకు వెళ్తున్నాడు. అయితే హీరోయిన్ ని మార్చకపోవడమే హాట్ టాపిక్ గా మారింది. మరోసారి తారక్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డేనే తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడుట. మరి బుట్టబొమ్మ సెంటిమెంట్ గా మారిందా? అందుకే రిపీట్ చేయాలనుకుంటున్నాడా? లేదూ గొప్ప పెర్పామర్ అని ఛాన్స్ ఇస్తున్నాడా? తనే చెప్పాల్సి ఉంది. కారణాలు ఏవైనా గురూజీ గ్యాప్ లేకుండా బుట్టబొమ్మ వెంట పడటం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది.