పూజా హెగ్డే తెలుగు వంటల ముచ్చట్లు

Tue Oct 19 2021 05:00:01 GMT+0530 (IST)

Pooja Hegde Telugu cuisine charms

సాదారణంగా హీరోయిన్స్ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎంతగా తినాలని మనసులో ఉన్నా కూడా కట్టి పెట్టి మరీ డైట్ ను ఫాలో అవుతారు. తమ ఫిజిక్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కోసం నోరు కుట్టేసుకుని ఉంటారు అనడంలో సందేహం లేదు. కొందరు మాత్రం తినడం మానేయకుండా తిన్న మేరకు వర్కౌట్లు చేస్తూ ఉంటారు. పూజా హెగ్డే రెండవ కేటగిరిలోకి వస్తుందట. తిండి విషయంలో అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా ఉంటుందట. తాజాగా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో ఒక చిట్ చాట్ లో తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పుకొచ్చింది. మా కుక్ ఒక తెలుగు వ్యక్తి. కనుక వారు చేసే వంటల్లో ఎక్కువగా తెలుగు వంటలు ఉంటాయి. వారు అన్ని తెలుగు వంటలు చక్కగా చేస్తారని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.ఇక తాను ముకుంద సినిమా షూటింగ్ లో పాల్గొనే సమయంలో నాకు ఆంద్రా ఫుడ్ అంటే ఇష్టం ఏర్పడింది. తెలుగు ఫుడ్ నాకు చాలా స్పెషల్ అంటూ పూజా చెప్పుకొచ్చింది. పూత రేకులు.. హైదరాబాదీ బిర్యానీ.. గోంగూర.. రొయ్యల కూర నాకు చాలా ఇష్టం. వీటిని రెగ్యులర్ గా తింటూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. డైటింగ్ పేరుతో నేను ఎక్కువగా కడుపు మాడ్చుకోను అని.. ఒక ప్రత్యేకమైన పద్దతిలో నేను కావాల్సినంత తినడంతో పాటు అందుకు తగ్గట్లుగా వర్కౌట్లు చేయడం వల్ల నేను ఎప్పుడు ఒకే విధంగా ఉంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే ఈ అమ్మడు తెలుగు లో నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా ఇటీవలే విడుదల అవ్వగా ఈమె నటించి విడుదలకు సిద్దం ఉన్న రాధే శ్యామ్ మరియు ఆచార్య సినిమాల కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మరో వైపు తమిళంలో మరియు హిందీలో కూడా ఈమె సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ లో వరుస ఆఫర్ల కోసం ఈ అమ్మడు సుదీర్ఘ కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాని ఈ అమ్మడికి వస్తున్నా ఆఫర్లు మాత్రం అంతంత మాత్రమే. కాని టాలీవుడ్ లో మాత్రం ఈమె కు పోటీ లేదు అన్నట్లుగా స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.