సినిమా రిలీజ్ అయ్యాక కూడా అంత ఎంక్వయిరీ చేస్తుందట

Sun Feb 09 2020 05:00:08 GMT+0530 (IST)

Pooja Hegde Talking About Promotions

ఇవాల్టి రోజున టాలీవుడ్ లో అగ్ర కథనాయిలు అన్నంతనే వచ్చే మొదటి మూడు పేర్లలో ఒకటి పూజా హెగ్డే. కుర్రకారు మతిని పోగొట్టే అందం.. ఆకర్షణ తో పాటు.. అమ్మడు సినిమా చేసిందంటే చాలు.. హిట్టు పక్కా అన్న సెంటిమెంట్ నేపథ్యం లో వరుస అవకాశాలు వచ్చేస్తున్నాయి. అయితే.. చాలామంది హీరోయిన్ల మాదిరి పూజా ఉండదట.సినిమాను ఒప్పుకున్న తర్వాత.. తమ పాత్రను ఫినిష్ చేసుకొని పత్తా లేకుండా పోయే హీరోయిన్ల కు పూజా పూర్తి భిన్నమట. ఇవాల్టి రోజున కొంతమంది హీరోయిన్లు ప్రమోషన్ వర్క్ కు కూడా రాని పరిస్థితి. వరుస హిట్లు ఉన్నప్పటికీ పూజా మాత్రం ప్రమోషన్ వర్క్ కు మాత్రమే కాదు.. సినిమా విడుదలయ్యాక ఏ ఏరియా లో సినిమా ఎలా ఆడుతోంది? ఏరియాల వారీగా కలెక్షన్లు ఎలా ఉన్నాయి? నిర్మాతలకు లాభ నష్టాల విషయం లో ఎలాంటి పరిస్థితి ఉందన్న విషయాల్ని కూడా ఫోకస్ చేస్తుందట.

తాను బిజినెస్ కమ్యునిటీ నుంచి వచ్చిన అమ్మాయినని.. అందుకే పెట్టుబడి పెట్టి సినిమా తీసే నిర్మాత బాగుండాలని కోరుకుంటానని చెప్పింది. నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుందన్న రీతి లో తాను ఆలోచిస్తానని.. తన రెమ్యునరేషన్ మాత్రమే తనకు ముఖ్యం కాదని.. తాను చేసిన సినిమా కూడా తనకు ముఖ్యమేనన్న పూజా మాటలతో నిర్మాతలు ఫిదా అయ్యే పరిస్థితి. పారితోషికం అందిన వెంటనే పత్తా లేకుండా వెళ్లే చాలామందితో పోలిస్తే.. పూజా పూర్తి భిన్నమైన నటిగా పలువురు అభివర్ణిస్తున్నారు. తాను చేసిన సినిమా రిలీజ్ అయ్యాక కూడా పూజా చేసే ఎంక్వయిరీలు ఆసక్తికరంగా మారాయి.