బుట్ట బొమ్మ జిగిబిగి అందాలు అదరహో

Mon Jun 01 2020 13:00:36 GMT+0530 (IST)

Pooja Hegde Stunning Pose

వీపు చూడు.. వీపందం చూడు! అన్నాడో కవి. అందుకేనేమో.. ఇదిగో ఇక్కడ బుట్ట బొమ్మ వీపందం చూపించేందుకు ఏమాత్రం మొహమాటపడడం లేదు. ఇక వీపందమేనా? అంటే.. అదిరిపోయే పింక్ లెహెంగాలో అన్ని యాంగిల్స్ లోనూ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇచ్చిన ఫోజులు కుర్రాకారు గుండెల్ని కకావికలం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ లేటెస్ట్ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.ఆ కురులను అలా ఆరబోసి.. చిరునవ్వులు చిందిస్తూ పూజా ఇచ్చిన ఫోజులు దేవతాసుందరినే తలపిస్తున్నాయి. ఇక ఎద అందాలు కను పాపల్ని చిత్తు చిత్తు చేస్తుంటే.. బ్యాక్ లెస్ లుక్ .. పొడవాటి లెహంగా స్టైల్ సంథింగ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.

కెరీర్ పరంగా చూస్తే.. టాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వెలిగిపోతున్న పూజా వరుసగా అగ్ర హీరోల సరసన జోడీ కడుతోంది. ప్రభాస్ - ఎన్టీఆర్- పవన్ కల్యాణ్ లాంటి స్టార్ల సినిమాల్లో నటిస్తూ  బిజీగా ఉంది. అటు బాలీవుడ్ లోనూ వరుసగా సంతకాలు చేస్తోంది. ఇటు తెలుగు అటు హిందీ సినిమాలతో బిజీ బిజీ గా ఉంది.  పూజా లోని హాట్ అప్పీల్ .. ఫ్లెక్సిబులిటీ తనకు వరుసగా ఇలాంటి క్రేజీ ఛాన్సులు తెస్తున్నాయనడంలో సందేహమేం లేదు.ప్రస్తుతం స్వీయ నిర్భంధ సమయాన్ని సోషల్ మీడియా లతో.. ఫోటోషూట్లతో స్పెండ్ చేస్తోంది.