గమ్మత్తుగా గుండెలు పిండేస్తున్న బుట్టబొమ్మ

Tue Sep 14 2021 12:00:14 GMT+0530 (IST)

Pic Talk: Pooja Hegde Stretching It Out

ఓ ప్రముఖ ప్రొడ్యూసర్ చెప్పినట్టు కళారంగంలో రాణించాలంటే యాక్టింగ్ వంద శాతం రానవసరం లేదు. నిజమే.. గుండెల్ని పిండేసే స్మైల్.. అటెన్షన్ ని క్రియేట్ చేసే అందం వుంటే చాలు. ఈ లక్షణాలన్నీ కలిగివున్న హీరోయిన్ పూజా హెగ్డే. తమిళంలో మిస్మిన్ డైరెక్షన్ లో జీవా నటించిన `ముగమూడి` చిత్రంతో సినిమాల్లోకి తెరంగేట్రం చేసిన ఈ పొడుగుకాళ్ల బుట్టబొమ్మ చైతన్య నటించిన `ఒక లైలా కోసం` చిత్రాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రం ఆశించిన స్థాయి ఫలితాన్ని అందించలేకపోయినా `ముకుంద` చిత్రంతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని దక్కించుకుంది.బాలీవుడ్ లో హృతిక్ రోషన్ పక్కన `మొహెంజదారో`లో అవకాశం వరించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. బన్నీతో చేసిన `డీజే-దువ్వాడ జగన్నాథం`తో ఇక్కడి యూత్ కి హాట్ ఫేవరేట్ గా మారిపోయింది. `రంగస్థలం`లో చేసిన `జిగేల్ రాణి` మరింతగా కలిసొచ్చి టాలీవుడ్ లో పూజ కెరీర్ ని జిగేల్ మనడానికి డోర్లు తెరిచేసింది. వెంట వెంటనే క్రేజీ స్టార్ హీరోల చిత్రాల్లో వరుసగా అవకాశాల్ని దక్కించుకుంది. బాలీవుడ్ లో అవకాశాలు వరిస్తున్నా టాలీవుడ్ పైనే ప్రత్యేక దృష్టిని పెట్టి ఇక్కడే స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిపోతోంది.

గురూజీ కంట్లో పడిన పూజా హెగ్డే అరవింద సమేతతో పాటు `అల వైకుంఠపురములో` చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది. యాక్టింగ్ స్కిల్స్‌తో కాకుండా తన బ్యూటీ స్మైల్‌తో ఈ బుట్ట బొమ్మ వరుస క్రేజీ ప్రాజెక్ట్ లని దక్కించుకుంటూ పలువురిని ఆశ్చర్య పరుస్తోంది. రామ్‌చరణ్ తో `ఆచార్య`  అఖిల్ తో  `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`.. ప్రభాస్ తో `రాధేశ్యామ్` .. ఇళయదళపతి విజయ్ తో `బీస్ట్` హిందీలో రణ్‌వీర్‌సింగ్‌తో రోహిత్‌శెట్టి రూపొందిస్తున్న `సర్కస్` చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా వుంది. ఇంత బిజీగా వున్నా ఈ బుట్ట బొమ్మ అన అభిమానుల్ని ఏ మాత్రం నిరాశపరచడం లేదు.

సోషల్ మీడియా వేదిగా నిత్యం అభిమానులతో టచ్ లో వుంటూ తన బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేస్తూ తన స్మైల్‌తో అభిమానుల గుండెల్ని మెల్ట్ చేస్తోంది. పూజా నయగారా వొంపుల్ని ఎలివేట్ చేస్తున్న ఈ ఫోటోషూట్ సంథింగ్ స్పెషల్ అంటూ కితాబిచ్చేస్తున్నారు బోయ్స్. వైట్ అండ్ స్కై బ్లూ కలర్ డిజైనర్ స్పోర్ట్ లుక్ అదిరిందంటూ పొగిడేస్తున్నారు. తనదైన స్టైల్లో అల్లరి చేస్తూ పూజ చేసిన ఫొటో షూట్ కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.