Begin typing your search above and press return to search.

డార్లింగ్ ఫ్యాన్స్ పూజ చేస్తున్నారుగా.. ?

By:  Tupaki Desk   |   5 Dec 2021 2:30 AM GMT
డార్లింగ్ ఫ్యాన్స్ పూజ చేస్తున్నారుగా.. ?
X
డార్లింగ్ అంటూ అందరినీ పిలుస్తూ తానే అతి పెద్ద డార్లింగ్ అయిపోయాడు ప్రభాస్. ఫ్యాన్స్ అంతా డార్లింగ్ లవ్ లో డీప్ గా ఏనాడో పడిపోయారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తరువాత హద్దులు లేని ప్రేమను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మూడేళ్ళ క్రితం వచ్చిన సాహో మూవీ తెలుగులో డిజాస్టర్, కానీ బాలీవుడ్ లో బాగానే ఆడింది. దాంతో రాధేశ్యామ్ మీద కూడా అంచనాలు బాలీవుడ్ లో అంబరాన్ని అంటున్నాయి.

కొత్త ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అవుతున్న రాధేశ్యామ్ సూపర్ డూపర్ హిట్ కావాలని ఫ్యాన్స్ అపుడే వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ఈసారి బ్లాక్ బస్టర్ పక్కా అంటూ భారీ స్టేట్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ ఇంత ధీమాగా ఉండడానికి తన హీరో మాత్రమే కారణం కాదుట. పక్కన ఉన్న పూజా హెగ్డే కూడానట.

పూజ మీద డార్లింగ్స్ కి ఒక్క సారిగా ఎందుకింత ప్రేమ అంటే దానికి రీజన్స్ ఉన్నాయి. అంతకు మించి సెంటిమెంట్ కూడా ఉంది. ఇప్పటికి వరసగా అయిది హిట్లను కొట్టింది పూజా. అంతే కాదు, ఫ్లాప్స్ లో ఉన్న హీరోలను సక్సెస్ బాట పట్టించింది. నా పేరు సూర్య ఫ్లాప్ తరువాత అల వైకుంఠపురంలో మూవీతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ షేక్ అయ్యే హిట్ ని అందుకున్నాడు. ఇక ఒక్క హిట్టు అంటూ తెగ తాపత్రయపడిన అక్కినేని వారి హీరో అఖిల్ కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ ద్వారా సూపర్ సక్సెస్ దక్కింది. ఈ రెండు మూవీస్ లో పూజా హీరోయిన్.

దాంతో పూజా హెగ్డే రాధేశ్యామ్ లో ఉంది కాబట్టి సాహో ఫ్లాప్ నుంచి ప్రభాస్ కచ్చితంగా బయటకు రావడమే కాదు బ్లాక్ బస్టర్ ని అందుకుంటాడని ధీమాగా చెబుతున్నారు. మరి యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద వందల కోట్లు కుమ్మరించి తీసిన ఈ సినిమాలో సాంగ్స్ అయితే ఒక రేంజిలో ఉన్నాయని ఫ్యాన్స్ హుషార్ చేస్తున్నారు. అన్నింటికీ మించి పూజాతో ప్రభాస్ చేసిన రోమాన్స్ పండించిన కెమిస్త్రీ అదరహో అనేస్తున్నారు.

మొత్తానికి డార్లింగ్ అంటూ కలవరించే ఫ్యాన్స్ ఇపుడు కాస్తా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని పూజా అంటూండడమే విడ్డూరం. పూజా హెగ్డే కి రాధేశ్యామ్ తో డబుల్ హ్యాట్రిక్ రావడం తధ్యమని కూడా ప్రభాస్ ఫ్యాన్స్ జోస్యం చెప్పేస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ కి రెండు కళ్ళలో ఇన్నాళ్లూ డార్లింగే ఉండేవాడుట. ఇపుడు ఒక కంట పూజాకి ప్లేస్ ఇచ్చేసి ఆమెకే పూజలు మొత్తం చేస్తున్నారుట.