ఫోటో స్టోరి: మాస్కు సరే.. బుట్టబొమ్మ పొట్టి ఫ్రాకు కథేమి!

Wed Aug 12 2020 11:15:52 GMT+0530 (IST)

Pooja Hegde Latest Stunning Pose

ప్రయాణాల్లో క్రౌడ్ లో వాడాల్సిన మాస్క్ ఏది?  ఇప్పటికీ చాలామందికి సరిగా తెలీదు దీని గురించి.. కానీ ఇదిగో ఇక్కడ బుట్టబొమ్మ పెట్టుకున్న మాస్క్ చూస్తే ఇదే కొనుక్కోవాలని అభిమానులు తపనపడతారేమో! ఇంతకీ ఇది ఏ రకం మాస్క్? అంటే.. ఎన్ 95 మాస్క్ ఇదే.అన్నట్టు మాస్క్ మాట దేవెడెరుగు? ఇలాంటి చిట్టి పొట్టి ఫ్రాకులాంటి స్కర్టులో అలా రోడ్లపైకి వచ్చేస్తే జనం కళ్లు మాస్కుపై ఉంటాయా?  లేక ఫ్రాకుపైనే నిలుస్తాయా?  పైగా పసుపు పచ్చ డిజైనర్ స్కర్టు మతి చెడగొడుతోంది. ఆ పొడుగు కాళ్ల అందానికి పడిపోవడం వల్లనే కదా..త్రివిక్రమ్ అంతటి వాడు పిలిచి మరీ అల వైకుంఠపురములో మూవీకి ఛాన్సిచ్చాడు. అల సొగసైన సోగ కాళ్లను చూసే కదా బన్ని ప్రేమలో పడిపోయాడు.

ఆ థై సొగసుకు మత్తెక్కనివాడు ఎవడు? ఇక టాప్ లోనూ ఆ అందాల ఎరకు చిక్కనిది ఎవరు?  కుర్రకారుకు తిక్క కుదిరిపోవడం గ్యారెంటీ. అల.. సిరీస్ లో సీక్వెల్స్ తీస్తే ఇక అన్నిట్లోనూ ఈ బుట్టబొమ్మకే ఛాన్సుంటుందేమో!! అన్నట్టు అల ఇంతకీ ముంబైలో ఉందా?  లేదూ హైదరాబాద్ వచ్చేసిందా? అన్నది తెలియాలంటే ఆరాలు తీయాలి. ముంబై టు హైదరాబాద్ ప్రయాణాలు ఈ కోవిడ్ వల్ల కుదిరే పనే కాదు. ప్రభాస్ తో రాధేశ్యామ్ ఇంకా పెండింగులో ఉంది. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీలోనూ నటించనుంది. సేమ్ టైమ్ అటు హిందీ ప్రాజెక్టులకు పూజా కమిటవుతోంది.