Begin typing your search above and press return to search.

మ‌త్తు క‌ళ్ల‌ పూజా విర‌హాగ్నితో జ్వ‌లిస్తోంది!

By:  Tupaki Desk   |   12 Jun 2021 11:30 PM GMT
మ‌త్తు క‌ళ్ల‌ పూజా విర‌హాగ్నితో జ్వ‌లిస్తోంది!
X
ఓవైపు టాలీవుడ్ మ‌రోవైపు బాలీవుడ్ రెండిటినీ మ్యానేజ్ చేస్తూనే కోలీవుడ్ పైనా దృష్టి సారించింది పూజా హెగ్డే. మూడు ప‌రిశ్ర‌మ‌ల్లో వ‌రుస చిత్రాల‌కు సంత‌కాలు చేసి క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉంది. మ‌రోవైపు ఈ ముంబై బ్యూటీ సోష‌ల్ మీడియాల్లోనూ వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ భారీ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది. ఇన్ స్టా వేదిక‌గా ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం ఆర్జిస్తోంది.

తాజాగా పూజా ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ యువ‌త‌రంలో ట్రెండింగ్ గా మారింది. పూజా నెవ్వ‌ర్ బిఫోర్ లుక్ ఇది అంటూ బోయ్స్ కితాబిచ్చేస్తున్నారు. మ‌త్తు క‌ళ్ల‌ పూజా విర‌హాగ్నితో జ్వ‌లిస్తోంది! అంటూ ఆ ఫోటోగ్ర‌ఫిక్ స‌మ్మోహ‌నంపై వ్యాఖ్య‌ల్ని గుప్పిస్తున్నారు. పూజా వెట్ లుక్ ఆయిలీ టోన్డ్ బాడీ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. బ్లాక్ అండ్ వైట్ లో స‌రికొత్త మూడ్ ని క్రియేట్ చేస్తోంది.

మ‌హారాష్ట్ర‌లో లాక్ డౌన్ ని స‌డ‌లిస్తుండ‌డంతో పూజా జిమ్ లో తన వ్యాయామ సెషన్లను తిరిగి ప్రారంభించింది. త‌దుప‌రి షూటింగుల‌కు జాయిన‌య్యేందుకు సిద్ధ‌మ‌వుతోంది. పూజా క‌థానాయిక‌గా న‌టించిన రాధేశ్యామ్.. మోస్టో ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రిలీజ్ ల‌కు రావాల్సి ఉంది. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో సిర్క‌స్ అనే చిత్రంలోనూ న‌టిస్తోంది. స‌ల్మాన్ స‌ర‌సన ఓ చిత్రంలో న‌టిస్తోంది. అటు త‌మిళంలో ద‌ళ‌ప‌తి 65లోనూ క‌థానాయిక‌గా అవ‌కాశం ద‌క్కించుకుంది.