బటన్ లెస్ ఫోజులతో మతి చెడగొట్టిన పూజా

Wed Jun 09 2021 11:00:02 GMT+0530 (IST)

Pooja Hegde Latest Photo

ముంబై బ్యూటీ పూజా హెగ్డే మళ్ళీ తెలుగులో రెండు భారీ చిత్రాలకు సంతకాలు చేయనుందని సమాచారం. 2021లో అల వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పటికే మూడు క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది.ప్రస్తుతం ఓ రెండు టాలీవుడ్ అగ్ర బ్యానర్లతో చర్చలు సాగిస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే సంతకాలు చేయనుందని సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశలో ఉన్న మూడు చిత్రాల రిలీజ్ ల కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. రాధే శ్యామ్ కొద్ది రోజుల చిత్రణ మిగిలి ఉంది. ఆచార్య ఒక పాట పూర్తి కావాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. ఈ మూడింటి రిలీజ్ తేదీలపై మరోసారి స్పష్ఠత రావాల్సి ఉంది. పూజా వీటన్నిటికీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తోంది. ఈలోగానే మరో రెండు చిత్రాలకు సంతకాలు చేసేందుకు రెడీ అవుతోంది.

మరోవైపు తమిళంలోనూ దళపతి విజయ్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. అటు బాలీవుడ్ లో రెండు బిగ్-టికెట్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఎన్ని పరిశ్రమల్లో నటించినా తనకు హిట్లిచ్చిన టాలీవుడ్ ని మాత్రం పూజా హెగ్డే విడిచిపెట్టే ఆలోచనలో లేదు. మరికొన్ని తెలుగు ప్రాజెక్టులపై సంతకం చేయడం ద్వారా మరో రెండేళ్లు ఇక్కడే బిజీగా ఉండనుందిట.

మరోవైపు పూజా సోషల్ మీడియాల్లో వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ అగ్గి రాజేస్తోంది. తాజాగా బటన్ లెస్ .. ఇన్నర్ లెస్ ఫోజుతో మతులు చెడగొడుతున్న ఫోటోని షేర్  చేయగా వైరల్ గా మారింది. ఇటీవల కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో తన ఇంట్లో భామ్మగారితో మామ్ డాడీతో పూజా ఆహ్లాదంగా స్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.