Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: కన్నడ బ్యూటీ ఖతర్నాక్ పోజులు

By:  Tupaki Desk   |   9 Oct 2019 4:16 AM GMT
ఫోటో స్టోరీ: కన్నడ బ్యూటీ ఖతర్నాక్ పోజులు
X
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న క్రేజీ బ్యూటీలలో పూజా హెగ్డే ఒకరు. తెలుగులో ఉన్న టాప్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ ఈ భామ ఇతర హీరోయిన్లకు అసూయ కలిగించే రేంజ్ లో ఉంది. ఇక సోషల్ మీడియాను ఆటాడుకోవడంలో కూడా ఈ భామ స్పెషలిస్ట్. అందుకే రెగ్యులర్ గా ఏదో ఒక ఫోటో షూట్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఆ ఫోటో షూట్లు యమా హాటుగా ఉంటాయి ఒక్కోసారి మాత్రం మహా స్టైలిష్ గా ఉంటాయి.

తాజాగా పూజా మహా స్టైలిష్ గా ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. ఆ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలకు "హైదరాబాద్ లో 'బాల' పాట లాంచ్ కోసం ఇలా రెడీ అయ్యాను. #హౌస్ ఫుల్ 4" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 'హౌస్ ఫుల్ 4' సినిమాలో పూజ హెగ్డే ఒక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ప్రమోషన్స్ లో భాగంగా 'హౌస్ ఫుల్ 4' సినిమాలోని కొత్త పాట రిలీజ్ ఈవెంట్ కోసం ఇలా తయారైంది. బ్లాక్ కలర్ షార్ట్ గౌన్లో పూజ అల్ట్రా మోడరన్ గా కనిపిస్తోంది. ఈ డ్రెస్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా హై హీల్స్ ధరించింది. అసలే పూజా టాల్ బ్యూటీ.. హీల్స్ కూడా ఉండడంతో ఇంటర్నేషనల్ మోడల్ తరహాలో కనిపిస్తోంది. పూజ డ్రెస్ పై 'లవ్ బోల్డ్' అనే ఇంగ్లీష్ పదాలు రాసి ఉన్నాయి.

ఈ ఫోటోలకు నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లతో తమ స్పందనను తెలిపారు. "హౌస్ ఫుల్ లో బ్యూటిఫుల్".. "బాలా కోసం కాలా".. "సూపర్ మోడల్".. "నీ నీడ ఆర్టిస్టిక్ గా ఉంది" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక పూజా హెగ్డే ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే హిందీ 'హౌస్ ఫుల్ 4' తో పాటుగా తెలుగులో అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'.. ప్రభాస్ 'జాన్' సినిమాల్లో నటిస్తోంది.'హౌస్ ఫుల్ 4' తో పాటుగా తెలుగులో అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'.. ప్రభాస్ 'జాన్' సినిమాల్లో నటిస్తోంది.