Begin typing your search above and press return to search.

'టాప్ టు బాటమ్' క్రేజీ లుక్కుతో బుట్టబొమ్మ చంపేసిందిగా!

By:  Tupaki Desk   |   7 April 2021 4:30 PM GMT
టాప్ టు బాటమ్ క్రేజీ లుక్కుతో బుట్టబొమ్మ చంపేసిందిగా!
X
సాధారణంగా హీరోయిన్ అందంగా ఉంది అంటుంటాం. కానీ కొందరిని చూస్తే బాబోయ్ ఈ భామేంటి మరీ ఇలా మనసులు లాగేసుకుంటుంది అనుకునే రేంజిలో ఆకర్షించే సోయగం స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే సొంతం. ఇప్పుడు ఈ వయ్యారిని స్టార్ అంటే సరిపోదేమో ఎందుకంటే త్వరలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్' ద్వారా అమ్మడు సౌత్ నార్త్ తో ప్రపంచదేశాలకు ఇంట్రడ్యూస్ అవుతుండటం విశేషం. అయితే పూజా ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపించినా కుర్రగుండెల్లో గంటలు మోగడం మాములే అయిపోయింది. ఎదురైన ప్రతిసారి ఏదొక ట్రెండీ లుక్కులో దర్శనమిస్తుంది ముంబై సుందరి.

ప్రస్తుతం అమ్మడు అన్ని భారీ బడ్జెట్ సినిమాలే చేసుకుంటూ పోతుంది. నిజం చెప్పాలంటే ముంబై నుండి వచ్చి ఇటు తెలుగుతో పాటు తమిళ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారిందంటే మాములు విషయం కాదు. త్వరలోనే వయ్యారి దళపతి విజయ్ సరసన పాన్ ఇండియా చేయనుంది. ఇదిలా ఉండగా.. పూజా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కుర్రకారును హీటేక్కించే ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది. అలాంటి ఫోటోనే ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా హల్చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోలలో పూజా వర్కౌట్స్ చేసి వస్తూ కెమెరా కంటచిక్కింది. మరి ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అలా వైట్ టాప్ అండ్ బాటమ్ జీన్స్ లో మెరిసిపోతున్న పూజాను టాప్ టు బాటమ్ కళ్లతో స్కాన్ చేసేస్తున్నారు. నిజానికి ఎవరేమనుకున్నా పూజా థైస్ ఉంటాయి గురూ.. ఆ విషయంలో మేడమ్ సార్ మేడమ్ అంతే! అంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.