Begin typing your search above and press return to search.

ప్యాకేజీని త‌ట్టుకోలేక దూరం పెడుతున్నారా?

By:  Tupaki Desk   |   29 Jan 2022 4:30 AM GMT
ప్యాకేజీని త‌ట్టుకోలేక దూరం పెడుతున్నారా?
X
నిండు కుండ తొణికిస‌లాడ‌దు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో పూజా హెగ్డే అంతే డిగ్నిటీ మెయింటెయిన్ చేస్తోంది. క‌రోనా క‌ష్ట‌ కాలంలోనూ కెరీర్ ప‌రంగా క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఎందుక‌నో ఇటీవ‌ల పూర్తిగా ఖాళీ అయిపోయింది. అయినా ఇంకా ఏదో బింకం మెయింటెయిన్ చేస్తోంది.

గ‌త ఏడాది `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` విడుద‌ల కాగా.. ఈపాటికే రాధేశ్యామ్ విడుద‌ల కావాల్సి ఉంది. కానీ ఇది వాయిదా ప‌డింది. త్వ‌ర‌లోనే ఈ మూవీ కూడా విడుద‌ల‌వుతుంది. అలాగే ఆచార్య‌.. బీస్ట్ చిత్రాలు కూడా ఏప్రిల్ లో విడుద‌ల కానున్నాయి. అంటే పూజా న‌టించిన సినిమాల‌న్నీ 2022 ప్ర‌థ‌మార్థంలోనే మెజారిటీ పార్ట్ విడుద‌లైపోతున్నాయి. జనవరి 14న విడుద‌ల కావాల్సిన రాధేశ్యామ్ కరోనా వైరస్ మహమ్మారి మూడో వేవ్ కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఆచార్య ఏప్రిల్ 1న విడుదల కానుంది. మిళ చిత్రం బీస్ట్ ఏప్రిల్ 14న విడుదల కానుంది. హిందీలో సర్కస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలన్నింటికీ పూజా తన పని పూర్తి చేసుకుంది. అందువల్ల ఆమె ఆ విడుదలల కోసం వేచి ఉంది. ప్రస్తుతం షూటింగ్ చేయడానికి నిజంగా ఏ ప్రాజెక్ట్ లేదు.

ప్ర‌స్తుతానికి మ‌హేష్ - త్రివిక్ర‌మ్ మూవీ త‌ప్ప ఇంకేదీ త‌న ఖాతాలో లేదు. ఈ సినిమా సెట్స్ కెళ్లేందుకు ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంది. అందువ‌ల్ల పూజాకి బోలెడంత తీరిక స‌మ‌యం చిక్కింది. ఈ స‌మ‌యంలో పూర్తిగా కుటుంబంతోనే టైమ్ స్పెండ్ చేస్తోంద‌ట‌. ఇక పూజా కాల్షీట్లు ఇవ్వాలే కానీ ఈ తీరిక స‌మ‌యం కూడా మిగ‌ల‌దు. కానీ పారితోషికం విష‌యంలో ఎంత మాత్రం త‌గ్గ‌డం లేదని వ‌రుస సక్సెస్ ల నేప‌థ్యంలో కొండెక్కి కూచుంటోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఒక్కో సినిమాకి రూ.3-4 కోట్ల మేర పారితోషికం డిమాండ్ చేస్తోంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

దీనివ‌ల్ల మిడ్ రేంజ్ నిర్మాత‌లు ఆ ద‌రిదాపుల్లోకి వెళ్ల‌డం లేద‌ట‌. కేవ‌లం అగ్ర హీరోల సినిమాలు.. పెద్ద బ్యాన‌ర్ లు అయితేనే పూజాని త‌ట్టుకోగ‌ల‌వ‌ని చెబుతున్నారు. ఇక విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాల స‌క్సెస్ రేంజును బ‌ట్టి పూజాకి త‌దుప‌రి ఆఫ‌ర్లు ఉంటాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.