ప్రభాస్ హీరోయిన్ టెన్షన్ ఫ్రీ అంట.. ఎందుకంటే?

Tue May 04 2021 13:02:53 GMT+0530 (IST)

Pooja Hegde Health Condition

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే కొన్నేళ్లుగా టాలీవుడ్ లో ఈ వయ్యారి హవా మాములుగా లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్దీ కాలానికే పూజా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకొని స్టార్డం సొంతం చేసుకుంది. అదేవిధంగా అదృష్టం కొద్దీ అమ్మడికి వరుసగా బ్లాక్ బస్టర్స్ పడేసరికి సౌత్ లో తిరుగులేకుండా పోయింది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి బారిన సినీ సెలబ్రిటీలు కూడా పడుతున్నారు. అలాగే తగిన జాగ్రత్తలు పాటిస్తూ కోలుకుంటున్నారు. అలాగే పూజా కూడా ఇటీవలే కరోనా బారినపడింది. కానీ అంత సీరియస్ ఏం లేదని స్వల్పంగా లక్షణాలు కనిపిస్తే ఐసొలేషన్ లో ఉన్నట్లు తెలిపింది పూజా.అలాగే డాక్టర్స్ సూచనలతో పాటు పూజా ఫిట్నెస్ పరంగా కూడా జాగ్రత్తలు వహిస్తుంది. పూజా ఫిట్నెస్ విషయంలో ఎలా ఉంటుందో ఫ్యాన్స్ అందరికి తెలుసు. ఫిట్నెస్ విషయంలో పూజా కూడా పలువురు సీనియర్ హీరోయిన్లను ఫాలో అవుతుంది. అవును.. పూజా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టిని సోషల్ మీడియాలో ఫాలో అవుతుంది. అంటే పూజాకు ఈ పొడుగు కాళ్ళ సుందరిని ఫాలో అయ్యే అవసరం ఏముంటుంది.. ఆల్రెడీ తానే స్వయంగా ఫిట్నెస్ ఫ్రీక్ కదా అనుకోవచ్చు. కానీ పూజా ఫాలో అవుతుంది ఆ విషయంలో కాదు. శిల్పాశెట్టి సోషల్ మీడియాలో ఫిట్నెస్ సంబంధిత యోగా టిప్స్ తో పాటు కరోనా నుండి బయటపడే టిప్స్ కూడా చెబుతోంది. అందుకే పూజా శిల్పాను ఫాలో అవుతున్నట్లు టాక్. మరి శిల్పాను ఫాలో అయ్యేసరికి కాస్త రిలీఫ్ గా కూడా ఉన్నట్లు పూజా తెలిపిందట. ప్రస్తుతం ఈ రాధేశ్యామ్ బ్యూటీ ఆరోగ్యం పరంగా ఎలాంటి టెన్షన్ లేదనేసరికి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.