వరల్డ్ ఛాంపియన్ బయోపిక్ లో గద్దలకొండ శ్రీదేవి

Tue Oct 22 2019 22:33:32 GMT+0530 (IST)

Pooja Hegde For PV Sindhu Biopic

ఇండియన్ బ్యాడ్మింటన్ స్థాయిని ఆకాశానికి తీసుకు వెళ్లిన స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు. కొన్ని కోట్లాది మందిని సింధు ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఆదర్శ క్రీడాకారిణి గురించి సినిమా రూపంలో తీసుకు వచ్చి మరింత మందికి ఆమె విజయాలను చూపించి స్ఫూర్తిని నింపాలని ఫిల్మ్ మేకర్స్ చాలా మంది భావిస్తున్నారు. ఈమద్య కాలంలో బయోపిక్ లు చాలా వస్తున్నాయి. బ్యాండ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ ను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు పీవీ సింధు బయోపిక్ గురించి వార్తలు వస్తున్నాయి.బాలీవుడ్ నుండి కోలీవుడ్ మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ చాలా మంది పేర్లు పీవీ సింధు బయోపిక్ విషయమై వినిపస్తున్నాయి. ఆ మద్య సమంత ఈ బయోపిక్ లో నటించబోతుందని ప్రచారం జరిగింది. కాని ఆ వార్తలు పుకార్లే అని తేలిపోయింది. పీవీ సింధు కాస్త హైట్ ఎక్కువ.. ఆమె ఫిజిక్ ను మ్యాచ్ చేయడం అంటే కాస్త కష్టమైన విషయమే. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో పీవీ సింధు పాత్రను చేయగల సత్తా కేవలం పూజా హెగ్డేకు ఉందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.

ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడిన పూజా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బయోపిక్ పాత్రలు చేయాలనే కోరిక నాకు చాలా ఉంది. పీవీ సింధు పాత్రను నాకు అప్పగిస్తే తప్పకుండా పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను అంటూ బయోపిక్ చేయాలనుకుంటున్న మేకర్స్ కు హింట్ ఇచ్చింది. మరి పూజా కోరిక మేరకు పీవీ సింధు బయోపిక్ మేకర్స్ ఆమెకు ఛాన్స్ ఇస్తారా చూడాలి.

ఇటీవలే 'గద్దలకొండ గణేష్' చిత్రంలో శ్రీదేవి పాత్రతో అలరించిన పూజా హెగ్డే త్వరలో అల వైకుంఠపురంలో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ జాన్ చిత్రంలో కూడా ఈమె నటిస్తోంది. ఇంకా పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ సమయంలో ఈమెకు పీవీ సింధు బయోపిక్ లో నటించే కోరిక కలిగింది. బాలీవుడ్ తో పాటు సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న పూజా హెగ్డే పీవీ సింధు బయోపిక్ లో నటిస్తే అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా మంచి మార్కెట్ ఈ సినిమాకు అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.