ఫోటో స్టోరి: దీనిపేరు `పూజాసనం`

Sat May 30 2020 10:30:46 GMT+0530 (IST)

Pooja Hegde During Her Yoga Seesion

యోగసాధన అంటే అంత సులువేమీ కాదు. అసనం చూసేందుకు సింపుల్ గా అనిపిస్తున్నా రూల్స్ బ్రేక్ చేయకుండా వేయాలంటే చాలా ఠఫ్ అన్నది ప్రాక్టికల్ గా చేసేవారికి అర్థమవుతుంది. ఇదిగో ఇక్కడ పూజా హెగ్డే ఎంత ఠిఫికల్ యోగా చేస్తోందో చూశారు కదా? ఎక్కడ పట్టు తప్పినా కీళ్లు పట్టేయడం గ్యారెంటీ.ప్రతిదీ నియమం ప్రకారం అసనం వేయాలి. అప్పుడే రిజల్ట్ కూడా అంతే ఇదిగా ఉంటుంది. ఈ విషయంలో పూజా పర్ఫెక్షన్ చూస్తుంటే అబ్బురపడాల్సిందే. గోడ సాయంతో ఇదిగో ఇలా ఓ డిఫరెంట్ అసనం ట్రై చేసింది. చక్రాసనంలో రకరకాల భంగిమల్ని సుసాధ్యం చేసింది. ఇంతగా శ్రమిస్తుంది కాబట్టే పూజా పర్ఫెక్ట్ ఫిట్ నెస్ తో చురకత్తిలాంటి లుక్ మెయింటెయిన్ చేయగలుగుతోంది. వరుసగా టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది. ముకుంద- ఒక లైలా కోసం- డీజే- అరవింద సమేత- అల వైకుంఠపురములో .. ఇలా గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. దానివెనక ఎంత కఠోర శ్రమ ఉందో అర్థం చేసుకోవాలి.

ఎన్టీఆర్.. మహేష్.. ప్రభాస్ ..అఖిల్..  లాంటి టాప్ స్టార్ల సరసన అవకాశాలు అందుకుంటోంది బుట్టబొమ్మ. ప్రస్తుతం ప్రభాస్ తో `ఓ డియర్` (ప్రభాస్ 20) రిలీజ్ కి రావాల్సి ఉంది. అలాగే అఖిల్ సరసన నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా రిలీజ్ కి రావాల్సి ఉంది. ఇవన్నీ పెండింగ్ చిత్రీకరణల కోసం వెయిటింగ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన.. త్రివిక్రమ్ తదుపరి చిత్రంలోనూ అవకాశం దక్కిందన్న ప్రచారం ఇటీవల సాగింది. మరోవైపు అటు బాలీవుడ్ లోనూ పూజా హెగ్డే కెరీర్ గ్రాఫ్ మునుముందు పెద్ద రేంజుకు చేరుకోనుందని చెబుతున్నారు.