'దళపతి65' సినిమాకు పాన్ ఇండియా బ్యూటీ భారీ డిమాండ్..!

Thu Mar 04 2021 21:00:01 GMT+0530 (IST)

Pooja Hegde Asking Huge Remueration For Thalapathy65

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కెరీర్ ప్రస్తుతం దశ తిరిగినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మడి చేతిలో మీడియం సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ స్టేటస్ పొందనుంది పూజా. అయితే తాజాగా దళపతి సినిమాలో హీరోయిన్ గా పూజ పేరు బాగా వినిపిస్తుంది. దళపతి 65వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ఎవరినేది తేలలేదు. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దళపతి 65వ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ పూజాహెగ్డేనే అంటూ కోలీవుడ్ కథనాలు చెబుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరనేది దర్శకనిర్మాతలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.అయితే దళపతి సినిమాకోసం పూజాహెగ్డే భారీ పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సినీ ఇండస్ట్రీలో చర్చనీయంశంగా మారిందనే చెప్పాలి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో దళపతి సరసన నటించేందుకు పూజ ఏకంగా 3.50 కోట్లు పారితోషికంగా తీసుకోబోతుందని సినీవర్గాలలో టాక్ నడుస్తుంది. నిజానికి దళపతి 65వ సినిమాను పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఆల్రెడీ పూజకు దేశవ్యాప్తంగా ఆదరణ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రేంజిలో పారితోషికం ఆశించడం మాములే అంటున్నారు సినీవర్గనిపుణులు. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలు అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.