న్యూయార్క్ వెకేషన్ లో బుట్ట బొమ్మ

Wed Aug 10 2022 21:54:40 GMT+0530 (IST)

Pooja Hegde  on New York vacation

చిత్ర పరిశ్రమలో రెగ్యులర్ గా విహారయాత్రల్లో కనిపించే బ్యూటీగా పూజా హెగ్డే పేరు లిస్ట్ లో ఉంది. ఇంతకుముందు మాల్దీవులు సహా గోవా విహారం నుంచి వరుస ఫోటోషూట్లను షేర్ చేసింది. అవన్నీ అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.విదేశీ విహార యాత్రలకు ఏ మాత్రం ఆస్కారం ఉన్నా.. పూజా అస్సలు మిస్ చేయదు. వెకేషన్స్ లో రకరకాల డిజైనర్ లుక్స్ తో మతులు చెడగొట్టడం తన హాబీ. క్యాజువల్.. గ్లామ్.. క్యూట్ చిక్ లుక్ లేక ఇంకేదైనా ప్రతిసారీ కళ్లు తిప్పుకోనివ్వని ట్రీటివ్వడమెలానో పూజాకి తెలిసినంతగా ఇతరులకు తెలీదు.

ప్రస్తుతం న్యూయార్క్ వెకేషన్ నుండి బుట్టబొమ్మ కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి వెబ్ లో వైరల్ గా మారాయి. పూజా ఎంతో సింపుల్ గా కనిపించినా ఫ్లోరల్ ఫ్రాక్ లో గుబులు రేపుతోంది. అందమైన న్యూయార్క్ నగరాన్ని అన్వేషించడానికి అలా షికార్ వెళుతూ కనిపించింది.  బ్యాక్ లెస్ మల్టీ కలర్ డ్రెస్ లో హ్యాపీ గా కనిపించింది. ఈ లుక్ లో పూజా బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది.  

పింక్ లుక్ కి తగ్గట్టే కాంబినేషన్ హ్యాండ్ బ్యాగ్ .. సౌకర్యవంతమైన బూట్ లతో పూజా నేచురల్ అప్పియరెన్స్ ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఈసారి వెకేషన్ లో ఫుల్ జాలీగా గడుపుతోంది. తన రోజువారీ ప్రయాణాలకు సంబంధించిన ఆహ్లాదకరమైన ఫోటోలు వీడియోలతో సోషల్ మీడియాల్లో తన అభిమానులను అప్ డేట్ చేస్తోంది. ముఖ్యంగా పూజా న్యూయార్క్ వాతావరణాన్ని బాగా లైక్ చేస్తోందని అర్థమవుతోంది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. పూజ తదుపరి విజయ్ దేవరకొండతో కలిసి `జనగణ మన`లో నటించనుంది. ఈ చిత్రంలో పూజా పాత్రకు నటన పరంగా నిరూపించుకునే స్కోప్ ఉంటుందని సమాచారం. ఇదే కాకుండా మహేష్ బాబు సరసన SSMB28 లో కూడా పూజా హెగ్డే కథానాయికగా నటించనుంది.

ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు. అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో `కబీ ఈద్ కబీ దీపావళి`లో నటించనుంది. బాలీవుడ్ లైనప్ లో రణవీర్ సింగ్ సరసన రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సర్కస్ విడుదలకు సిద్ధమవుతోంది.