ఊహాగానాలు రాయొద్దంటూ కుర్రబ్యూటీ మమ్మీ చిందులు

Thu May 13 2021 06:00:01 GMT+0530 (IST)

Pooja Bedi made sensational comments

ఇటీవలే బాలీవుడ్ నటి పూజా బేడి కుమార్తె ఆలయ ఫర్నిచర్ వాలా ముంబై పొలిటికల్ లీడర్ బాల్ ఠాక్రే మనవడు ఐశ్వరీ ఠాక్రేతో డీప్ లవ్ లో ఉన్నట్లు మీడియా కోడై కూసిన సంగతి తెలిసిందే. ఆలయ బర్త్ డే వేడుకను దుబాయ్ లో ప్రియుడు గ్రాండ్ గా నిర్వహించారని..ఆ వేడుకకు ఐశ్వరీ ఠాక్రే తల్లి సహా ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారని కథనాలొచ్చాయి. దీంతో వీళ్లిద్దరి ప్రేమాయణం వార్తలు పతాక స్థాయికి చేరుకున్నాయి. పబ్ లు..పార్టీలు అంటూ షికార్లు చేస్తోన్న ఫోటోలు సైతం బయటకు  రావడంతో మీడియా వర్గాల్లో సైతం ఆసక్తికర డిబేట్ అయింది. ఈ నేపథ్యంలో ఆలయ ఈ వ్యాఖ్యల్ని ఖండించింది. ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని..అంతకు మించి ఎలాంటి రిలేషన్ లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.అలాగే ఐశ్వరీ తల్లి కూడా ఆ వ్యాఖ్యల్ని సమర్ధించారు. ఇద్దరూ స్నేహితులు మాత్రమే.. అంతకు మించి ఊహించుకుని రాసుకోవడానికి ఏదీ లేదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై ఆలయ తల్లి పూజా బేడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాపై నిప్పులు చెరిగారు. కేవలం ఊహాగానాలతోనే వ్యక్తిగత జీవితాల్ని అంచనా వేయోద్దంటూ మండిపడ్డారు. మీడియా ఆలయపై చాలా ఆసక్తిగా ఉందంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు.

ఈ రోజుల్లో ఏ  వయసులో  ఎలా ఉండాలనే దాన్ని అంచనా వేయోద్దని చెప్పుకొచ్చారు పూజా బేడీ. ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వారు ఆనందంగా గడిపే హక్కు వారికుంటుందని  మీడియాకు చురకలంటించారు. ప్రస్తుతం పూజా బేడి చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవలే మదర్స్ డే సందర్భంగా ఆలయా బేడి తల్లి బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నెటిజనులు పూజా బేడి ఫోటోలపై రకరకాల కామెంట్లతో మోతెక్కించారు. ఇటీవలే ఆలయా ఫర్నిచర్ వాలా జవానీ జానేమన్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.