Begin typing your search above and press return to search.

#BollywoodCleanup అంటూ మీడియా సమస్యలను పక్కదారి పట్టిస్తోందా?

By:  Tupaki Desk   |   25 Sep 2020 5:50 PM GMT
#BollywoodCleanup అంటూ మీడియా సమస్యలను పక్కదారి పట్టిస్తోందా?
X
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఈ కేసులో రంగంలోకి దిగిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) బాలీవుడ్‌ - డ్రగ్స్‌ సంబంధాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు మరికొంతమందిని కస్టడీలో తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణే - శ్రద్ధా కపూర్ - సారా అలీఖాన్ - రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లకు ఎన్సీబీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సీబీ విచారణకు హాజరైంది. అయితే డ్రగ్స్ వ్యవహారంలో కేవలం బాలీవుడ్ చిత్ర పరిశ్రమనే టార్గెట్ చేస్తున్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటి పూజా బేడీ ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందించింది.

పూజా బేడీ ట్వీట్ చేస్తూ బాలీవుడ్‌ ఒక్క పరిశ్రమే డ్రగ్స్ వాడుతున్నట్లు మీడియా హడావుడి చేస్తుందని విమర్శించారు. బాలీవుడ్‌ కాకుండా మిగతా రంగాలలో విపరీతంగా డ్రగ్స్‌ వాడుతున్న వారిని మనం ఎందుకు వెంటాడటం లేదు? అని ప్రశ్నించింది. #BollywoodCleanup అంటూ మీడియా ముఖ్యమైన సమస్యల నుండి పక్కదారి పట్టించాడనికేనా? అని పూజా బేడీ అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీనిపై నెటిజన్స్ నుంచి మిశ్రమ కామెంట్స్ వస్తున్నాయి. కొందరు కావాలనే బాలీవుడ్ ని టార్గెట్ చేస్తున్నారని అంటుంటూనే.. మరికొందరు మాత్రం ఈ వేట అన్ని చోట్లా ఉందని.. కాకపోతే వీళ్లంతా సెలబ్రిటీలు కాబట్టి మెయిన్ గా ఫోకస్ అవుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.