Begin typing your search above and press return to search.

కూతురు వ‌య‌సున్న హీరోయిన్ తో ఎఫైర్?

By:  Tupaki Desk   |   9 Dec 2022 4:15 AM GMT
కూతురు వ‌య‌సున్న హీరోయిన్ తో ఎఫైర్?
X
ఓవైపు ప్రభాస్- కృతి సనన్ డేటింగ్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మ‌రోవైపు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా- కియ‌రా అద్వాణీ జంట పెళ్లికి స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని వైర‌ల్ గా మారాయి. కానీ వీట‌న్నిటికీ డిఫ‌రెంట్ గా త‌న కూతురు వ‌య‌సున్న ఒక అందాల హీరోయిన్ తో ప్ర‌ముఖ బాలీవుడ్ స్టార్ హీరో డేటింగ్ చేస్తున్నారంటూ పుకార్ పుట్టుకురావ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఆ ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌స్తుతం ఓ భారీ చిత్రంలో జంట‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ లోనే ఒక‌రితో ఒక‌రు ప్రేమ‌లో ప‌డ్డార‌ని ప్ర‌చార‌మైపోతోంది. నిజానికి స‌ద‌రు సీనియ‌ర్ హీరో వ‌య‌సు ఇప్పుడు 56. ష‌ష్ఠిపూర్తికి నాలుగు సంవ‌త్స‌రాలే మిగిలి ఉంది. కానీ ఈ వ‌య‌సులో అత‌డు స‌ద‌రు యంగ్ హీరోయిన్ తో ఎఫైర్ సాగిస్తున్నాడ‌న్న గుస‌గుస‌లు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఓవైపు వ‌రుస‌గా భారీ చిత్రాల్లో న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా ఉన్న స‌ద‌రు హీరోకి క‌థానాయిక‌ల‌తో డేటింగులు కొత్తేమీ కాదు. గ‌తంలో ఐదుగురు హీరోయిన్ల‌తో రొమాంటిక్ లైఫ్ ని ఆస్వాధించాడు. ఇద్ద‌రితో సుదీర్ఘ కాలం స‌హ‌జీవ‌నం చేసాడు. కానీ ఇప్పుడు అలా చేసేంత స‌మ‌యం త‌న‌కు ఉందా? అంటూ ఒక సెక్ష‌న్ సందేహాలు వ్య‌క్తం చేస్తున్నా కానీ.. యంగ్ హీరోయిన్ తో సీనియ‌ర్ హీరో ఎఫైర్ క‌హానీ ప్ర‌స్తుతానికి వెబ్ ని వేడెక్కించేస్తోంది.

ఇంత‌కీ ఈ ఎపిసోడ్ లో హీరోయిన్ ఎవ‌రు? సీనియ‌ర్ హీరో ఎవ‌రు? అంటూ ఆరాలు తీస్తే.. ఇంకెవ‌రు ? అందాల బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే త‌న కోస్టార్ స‌ల్మాన్ ఖాన్ తో ప్రేమ‌లో ప‌డింద‌ని పుకార్ షికార్ చేస్తోంది.

ఈ జంట ప్ర‌స్తుతం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సెట్స్ లో క‌లిసి ప‌ని చేస్తున్నారు. అదే క్ర‌మంలో ప్రేమలో పడ్డారని ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారని మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి.

అంతేకాదు.. స‌ల్మాన్ భాయ్ త‌న బ్యాన‌ర్ లో వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు పూజాతో భారీ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నార‌న్న చ‌ర్చ కూడా సాగుతోంది. మొత్తానికి ఇది నిజ‌మా అబ‌ద్ధ‌మా? అన్న‌ది అటుంచితే ఆ ఇద్ద‌రికీ మ‌ధ్య క‌నెక్ష‌న్ పెడుతూ గాసిప్పులు పుట్టించ‌డం షాకిచ్చేదే. స‌ల్మాన్ వ‌య‌సులో స‌గం వ‌య‌సు కూడా లేని పూజా హెగ్డే అత‌డితో డేటింగుకి వెళుతోందా? బాలీవుడ్ మీడియాలో ఇలాంటి క‌థ‌నాలు రొటీనే కానీ ఇప్పుడు తెలుగు మీడియాలోను ఈ గాసిప్ హాట్ డిబేట్ గా మారుతోంది.

తాజా ట్వీట్ తో సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వైర‌ల్ అవుతున్నాయి. ఈ క‌థ‌నం నిజ‌మేనా భాయ్? అంటూ కొందరు సల్మాన్ ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ''పూజా వ‌య‌సు చూస్తే సల్మాన్ కుమార్తె వయస్సు. ఆమె చిన్న ఏజ్ లో లేక‌పోయినా కానీ..! ఈ బాలీవుడ్ ఎంత అసహ్యంగా ఉందో చూడండి. ప్రేమ గుడ్డిదని న‌మ్మండి'' అంటూ ఒక‌రు వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్ర‌చారాల్లో నిజం ఎంతో ఎవ‌రూ చెప్ప‌లేరు . అధికారికంగా ఎవ‌రి నుంచి ఎలాంటి స‌మాచారం లేదు. మ‌రోవైపు పూజా హెగ్డే హిందీ చిత్రాల‌తో పాటు సౌత్ లోను బిజీబీజీగా ఉంది. ఇక్కడ మ‌హేష్ స‌ర‌స‌న త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.