విక్రమ్ కు మణిరత్నం ఇచ్చిన స్పేస్ అంతేనా?

Sat Oct 01 2022 10:52:03 GMT+0530 (India Standard Time)

Ponniyin Selvan Part 1 Chiyan Vikram

రాజమౌళి అందించిన 'బాహుబలి' స్ఫూర్తితో దిగ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తన కలల ప్రాజెక్ట్ అయిన 'పొన్నియిన్ సెల్వన్'ని తెరపైకి తీసుకొచ్చాడు. గత కొన్నేళ్లుగా బడ్జెట్ లెక్కల కారణంగా కార్యరూపం దాల్చని ఈ పీరియాడికల్ డ్రామా ఎట్టకేలకు లైకా ప్రొడక్షన్స్ రంగంలోకి దిగడంతో పట్టాలెక్కింది. కల్కీ కృష్ణమూర్తి ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని బుక్ ప్రకారం ఐదు భాగాలుగా తెరకెక్కించాలి. కానీ అన్ని భాగాలు సాధ్యంకాదు కాబట్టి ఐదు భాగాలను రెండు భాగాలుగా కుదించి పార్ట్ 1 పార్ట్ 2 కింద రూపొందించారు.అయితే ఇక్కడే మణిరత్నం తన మ్యాజిక్ ని తన అనుభవాన్ని సరిగా వాడలేదని తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య ఫస్ట్ పార్ట్ 'పొన్నియిన్ సెల్వన్ 1' ఐదు భాషల్లో సెప్టెంబర్ 30న శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో ఈ మూవీకి ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది కానీ ఇతర భాషల్లో మాత్రం జీరో బజ్. ఈ నేపథ్యంలో  తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదలైన ఈ మూవీకి అన్ని చోట్ల యూనానిమస్ గా ఫ్లాప్ టాక్ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మొదలైంది.

ఇలాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలకు గ్రాండీయర్ విజువల్స్ అబ్బురపరిచే మేకింగ్ తో పాటు ప్రేక్షకులని కట్టిపడేసే భావోద్వేగాలు. 'పొన్నియన్ సెల్వన్ 1'లో గ్రాండీయర్ విజువల్స్ అబ్బురపరిచే మేకింగ్ విలువలు వున్నా సగటు ప్రేక్షకుడికి కావాల్సిన కట్టిపడేసే భావోద్వేగాలు లేకపోవడం ప్రధాన మైనస్ గా మారింది. ఇదిలా వుంటే కథకు కీలకంగా నిలిచే ఆదిత్య కరికాలన్ పాత్రలో నటించిన విక్రమ్ కు మణిరత్నం ఫస్ట్ పార్ట్ లో పెద్దగా స్పేస్ ఇవ్వకపోవడం ఇప్పడు ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.  

సినిమాలో చియాన్ విక్రమ్ పోషించిన ఆదిత్య కరికాలన్ పాత్రే కీలకం.. అయితే ఆ పాత్రకు ఫస్ట్ పార్ట్ ఎలా నామ మాత్రపు సీన్ లని కేటాయించి నీరుగార్చిన తీరుపై విక్రమ్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. రెండ గంటల యాభై నిమిషాల నిడివిగల సినిమాలో విక్రమ్ కు ఇచ్చిన స్పేస్ చాలా తక్కువ. అతన్ని చూపించింది కేవలం పావుగంట లోపే.. ఇక ఇలాంటి నటుడిని పక్కన పెట్టి జయం రవిని టైటిల్ పాత్రలో చూపించిన తీరు మణిరత్నం ఏ స్థాయి పొరపాటు చేశాడో స్పష్టమవుతోంది.

తమిళ తెలుగు భాషల్లో ఎలాంటి క్రేజ్ లేని హీరోని పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైటిల్ పాత్రలో చూపించడంతో అంతా షాక్ గురవుతూ కామెంట్ లు చేస్తున్నారు. మణిరత్నం ఎంచుకున్న పాత్రలని బట్టే సినిమా ఫలితం ముందే డిసైడ్ అయిందని అంటున్నారు. విక్రమ్ ఫ్యాన్స్ అయితే మణిరత్నంపై మండిపడుతున్నారు. నటనకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన విక్రమ్ కు ఫస్ట్ పార్ట్ లో ఇచ్చిన స్పేస్ ఇదా?.. ఈ ఒక్క పాత్రకు ఇచ్చిన ప్రాముఖ్యత సినిమా ఫలితాన్ని డిసైడ్ చేసిందని మండిపడుతున్నారట.

పోనీ రెండవ భాగంలో అయినా ప్రాముఖ్యత ఇచ్చి వుంటారా అనడానికి ఫస్ట్ పార్ట్ లో ఎలాంటి లీడ్ ఇవ్వలేదు. అలాంటి ఫీల్ ని ప్రేక్షకుల్లో కలిగించడంలోనూ మణిరత్నం దారుణంగా ఫెయిల్ అయ్యాడని సెటైర్లు వేస్తున్నారు. చిన్న యుద్దం రెండు మూడు ఎమోషనల్ సీన్ లతో విక్రమ్ పాత్ర కథ ముగించాడని ఇలాంటి నటుడిని వాడుకునే పద్దతి ఇదా? .. అని విక్రమ్ ఫ్యాన్స్ మణిరత్నంపై ఫైర్ అవుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.