Begin typing your search above and press return to search.

త‌మిళ‌నాట ఖ‌రార‌వుతున్న పొంగ‌ల్ సినీ వార్!

By:  Tupaki Desk   |   23 Sep 2021 10:36 AM GMT
త‌మిళ‌నాట ఖ‌రార‌వుతున్న పొంగ‌ల్ సినీ వార్!
X
తెలుగునాట సంక్రాంతి విడుద‌ల‌లు సినీ అభిమానుల మ‌ధ్య‌న ఎంత హాట్ టాపిక్ అవుతూ ఉంటాయో, త‌మిళ‌నాడు క‌థ కూడా అలానే ఉంటుంది. సంక్రాంతిని పొంగ‌ల్ గా జ‌రుపుకునే త‌మిళులు ఇదే సంద‌ర్భంలో సినిమాల‌కూ పెద్ద పీట వేస్తూ ఉంటారు. సంక్రాంతి స‌మ‌యంలో సినిమాలు తెలుగునాట ఏ స్థాయి ఆట విడుపో, త‌మిళ‌నాడు కూడా అదే రేంజ్. ఈ నేప‌థ్యంలో అక్క‌డ కూడా పొంగ‌ల్ కు పెద్ద పెద్ద సినిమాలు వ‌స్తూ ఉంటాయి. పొంగ‌ల్ సంద‌ర్భంగా త‌మిళ స్టార్ హీరోల మ‌ధ్య‌న కూడా వార్ న‌డుస్తూ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది పొంగ‌ల్ కు సినీ వార్ ఖ‌రారు అవుతూ ఉంది.

ఇప్ప‌టికే పోటాపోటీ హీరోలుగా పేరున్న అజిత్, విజ‌య్ లు మ‌రోసారి ఢీ కొన‌బోతున్నారు. వ‌చ్చే పొంగ‌ల్ కు వీరిద్ద‌రి సినిమాలూ విడుద‌ల కాబోతున్నాయ‌నే క్లారిటీ వ‌చ్చేసింది. అజిత్ సినిమా వాలిమై ని వ‌చ్చే పొంగ‌ల్ కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టుగా నిర్మాత బోనీ క‌పూర్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో, విజ‌య్ తో వార్ ఖ‌రారు అయ్యింది.

విజ‌య్ సినిమా బీస్ట్ కూడా పొంగ‌ల్ కు విడుద‌ల కాబోతోంది. వాలిమై డైరెక్ట‌ర్ హెచ్ వినోద్ కాగా సెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బీస్ట్ రూపొందింది. బీస్ట్ లో పూజాహెగ్డే హీరోయిన్.

విజ‌య్, అజిత్ ల మ‌ధ్య.. ప్ర‌త్యేకించి వారి అభిమాన బ‌ల‌గాల మ‌ధ్య‌న పోటీ ఈనాటిది కాదు. ప‌ర‌స్ప‌రం గేలి చేసుకోవ‌డానికి, గొడ‌వ ప‌డ‌టానికి కూడా వెనుకాడ‌రు. ఒక హీరో అంటే మ‌రో హీరో అభిమానుల‌కు చాలా చుల‌క‌న‌. ఆ హీరోలు త‌మ మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం ఏమీ లేద‌ని అని అనేక సార్లు చెప్పినా, అభిమానుల తీరులో మాత్రం మార్పు ఉండ‌దు. ఇలాంటి క్రమంలో క‌రోనా ప‌రిస్థితులు వ‌చ్చే సంక్రాంతి నాటికి పూర్తిగా స‌ద్దుమ‌ణిగితే, థియేట‌ర్ల‌లో ఈ హీరోల సినిమాల మ‌ధ్య‌న ఫ్యాన్ వార్ భారీ స్థాయిలోనే ఉండ‌వ‌చ్చు! ఈ సినిమాల‌కు తోడు మ‌రిన్ని సినిమాలు కూడా పొంగ‌ల్ బ‌రిలో ఉంటాయ‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.